టీచర్ కొట్టాడని విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్: టీచర్ కొట్టాడని విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. జిల్లాలోని సైదాపూర్ మండలం సోమారంలోని మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నవిద్యార్థిని శ్రావణి టీచర్‌ సాధిక్ తీవ్రంగా కొట్టాడంటూ సూసైడ్‌ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్ధిని శ్రావణి మరణంతో సోమారంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ac buses coming in miyapur to shamshabad route

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మేడిపల్లి ఎస్సై వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్(19) మల్లాపూర్ మల్లికార్జున్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ కంపెనీలో మెషీన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.

అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం ఉదయం బోడుప్పల్ బొల్లిగూడలోని నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తానొక అమ్మాయిని ప్రేమించానని, ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్‌ రాశాడు.

ఆ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


ఏసీ బస్సులు: మియాపూర్ టు శంషాబాద్

మియాపూర్ టు శంషాబాద్ విమానాశ్రయానికి ఏసీ బస్సులను నడుపుతున్నట్లు మియాపూర్ డిపో-2 మేనేజర్ బి.వెంకారెడ్డి సోమవారం తెలిపారు. గంటకు ఒకటి చొప్పున ప్రతి రోజూ 48 ట్రిప్పులు బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏసీ బస్సులు పటాన్‌చెరువు, రాంచంద్రాపురం, చందానగర్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.

మియాపూర్ నుంచి శంషాబాద్‌కు బస్సు చార్జీ రూ. 250గా నిర్ణయించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+