ఏసీబీ వలలో మరో అవినీతి జలగ: 10 కోట్ల ఆస్తులు కూడబెట్టాడు (ఫోటోలు)
హైదరాబాద్: ఏసీబీ వలలో మరో అవినీతి జలగ పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అతినీతి అధికారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే పలువురు అవినీతి అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ తాజాగా గురువారం వాణిజ్య పన్నుల శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్ నల్లా సాయికిషోర్‌పై దాడి చేసింది.
ఈ దాడిలో సాయికిషోర్‌కు ఆదాయానికి మించి కోట్లాది రూపాయల ఆస్తులున్నట్టు అధికారులు కనుగొన్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన ఈ సోదాల్లో సాయికిషోర్ కూడబెట్టిన భారీ అక్రమార్జన బయటపడింది.గురువారం ఉదయం సాయికుమార్ ఇంటిపై సోదాలను నిర్వహించి పలు డాక్యుమెంట్లు, విలువైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ వలలో మరో అవినీతి జలగ
సాయికిశోర్ వద్ద ఏబీసీ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ములో 2 కిలోల బంగారం, 10 కిలోల వెండితో పాటు హైదరాబాద్, నల్లగొండల్లో ఫ్లాట్లు, గచ్చిబౌలిలో ఇండిపెండెంట్ హౌస్, కృష్ణ జిల్లా విసన్నపేటలో 6 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన స్థిరాస్తి పత్రాలు ఉన్నాయి.

ఏసీబీ వలలో మరో అవినీతి జలగ
వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.10 కోట్లకు పైమాటేనని ఏసీబీ వర్గాల సమాచారం. కృష్ణా జిల్లాకు చెందిన సాయికిషోర్ 1997లో వాణిజ్య పన్నుల శాఖలో చేరారు.

ఏసీబీ వలలో మరో అవినీతి జలగ
ప్రస్తుతం నల్లగొండ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సాయికిషోర్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. సాయికిషోర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఏసీబీ వలలో మరో అవినీతి జలగ
ముందుగా నల్లగొండలోని మీర్‌భాగ్ కాలనీలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంటితో పాటు హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లోని ఎస్‌వీఎస్‌ఎస్ సాయి సంకల్ప అపార్ట్‌మెంట్‌లోని సొంత ఫ్లాట్ ఏకకాలంలో దాడులు చేశారు.

ఏసీబీ వలలో మరో అవినీతి జలగ
వీటితో పాటు రెండు ప్రాంతాల్లోనే కాక కృష్ణా జిల్లా తిరువూరులోని ఆయన సోదరుల ఇళ్లు, హైదరాబాద్‌లోని ఆయన సోదరీమణుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు.

ఏసీబీ వలలో మరో అవినీతి జలగ
ఈ సోదాల్లో భాగంగా సాయికిషోర్ హైదరాబాద్, నల్లగొండల్లోనే కాక మహబూబ్‌నగర్ జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో స్థిరాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏసీబీ వలలో మరో అవినీతి జలగ
ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ కోటేశ్వరరావు మాట్లాడుతూ సాయికిషోర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ కోర్టు సర్చ్‌వారెంట్‌తో ఈ సోదాలు చేశామన్నారు.

ఏసీబీ వలలో మరో అవినీతి జలగ
హైదరాబాద్‌తోపాటు నల్గొండ, కృష్ణ జిల్లాల్లో ఏకకాలంలో జరిగిన సోదాల్లో ఆయన వద్ద రూ. కోటికిపైగా ఆస్తులు బయటపడినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications