ఓటుకు నోటు: ఆడియో, వీడియో ఇచ్చేందుకు ఈసీకి ఏసీబీ కోర్టు నో
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో రికార్డింగులతో పాటు ఇతర ఆధారాలను ఇప్పించాలంటూ ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం శనివారం నాడు తిరస్కరించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన వ్యవహారం కావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా దర్యాఫ్తు అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులు, ఇతర పత్రాల నకలు ఇవ్వాలని కోరుతూ ఈసీ మూడు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసింది.

ఈసీ డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శ్రీ దేవసేన దీనిపై ఏసీపీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే, మెమో విచారణార్హం కాదంటూ ఏసీబీ 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి తిరస్కరించారు. సాంకేతిక కారణాల దృష్ట్యా విచారణార్హం కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications