సాయంత్రంలోగా: సండ్రకు ఏసీబీ, ఏమిటీ 160 సెక్షన్? గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 19వ తేదీన సాయంత్రం ఐదు గంటల లోపు తమ ఎదుట హాజరు కావాలని సూచించింది. తొలుత సండ్ర
నివాసంలో నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో తలుపుకు నోటీసు అంటించారు. తాజాగా బుధవారం మరోసారి నోటీసులు ఇచ్చారు.

సండ్రకు ఏసీబీ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఏదైనా దర్యాప్తులో భాగంగా సదరు కేసుతో సంబంధం ఉందన్న వారి నుంచి వాంగ్మూలం నమోదు చేసే అధికారం ఈ సెక్షన్ కల్పిస్తుంది.
నోటీసు అందుకున్న వ్యక్తి తనకు తెలిసిన సమాచారానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. దీని న్యాయస్థానానికి సమర్పిస్తారు. సండ్రతోపాటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీపడ్డ వేం నరేందర్ రెడ్డి నుంచి కూడా వాంగ్మూలం తీసుకోవాలని ఏసీబీ నిర్ణయించింది.

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసులో తాజా పరిణామాలు, సెక్షన్ 8పై వివాదం, ఏపీలో తన పైన నమోదైన కేసులు తదితర అంశాల పైన గవర్నర్‌తో చర్చించారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ సీఎస్‌ను సీపీ మహేందర్ రెడ్డి కలిశారు.
నాంపల్లి కోర్టుకు బయలుదేరిన స్టీఫెన్ సన్
ఓటుకు నోటు కేసులో మెజిస్టేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications