'అసిస్టెంట్' ఆఫీస్‌లో ఏసీబీ సోదా: ప్లాట్లుసహా కోట్ల ఆస్తి

హైదరాబాద్/అదిలాబాద్: అదిలాబాద్ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, అదిలాబాదులలో కంట్రోలర్ విజయ్ గోపాల్ నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు.

ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల పైన సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల ఆస్తులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదుతో పాటు పలుచోట్ల ఆయనకు చాలా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారని సమాచారం.

ACB raid on Assistant Drug Controller's house reveals horde of wealth

దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, నల్లకుంట, చిక్కడపల్లి, మలకపేట, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో ఆయనకు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నట్లుగా గుర్తించారు. మల్కాజిగిరిలో ఆరు ప్లాట్లు ఉన్నాయని గుర్తించారని సమాచారం. ఈయన ఆస్తుల పైన సోదాల కోసం ఆరు టీంలు ప్రత్యేకంగా రంగంలోకి దిగాయి. బినామీల పేర్ల మీద కూడా ఆయన ఆస్తులు కూడబెట్టినట్లుగా అనుమానిస్తున్నారు.

డీడీ కాలనీలో 200 గజాల స్థలం, దిల్‌సుఖ్ నగర్‌లో 18 వందల చదరపు అడుగుల స్థలం, షాద్ నగర్‌లో రెండు వందల ఎకరాల భూమి... ఇలా చాలా వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. పలు కమర్షియల్ కాంప్లెక్స్‌లు పలు చోట్ల ఉన్నట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+