20కోట్లు?: ట్రాన్స్‌కో ఏడిఈ ఇంట్లో ఏసిబి సోదాలు
హైదరాబాద్: అక్రమాస్తులు ఉన్నాయనే సమచారంతో సైదాబాద్ సరస్వతినగర్‌లోని ట్రాన్స్‌కో ఏడిఈ శ్యాంసుందర్ రెడ్డి ఇంట్లో ఏసిబి అధికారులు బుధవారం సోదాలు చేశారు. సోదాల్లో భారీగా బంగారం, డబ్బు, ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు బయటపడ్డాయి. శ్యాంసుందర్ రెడ్డి రూ. 20 కోట్లపైనే ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మింట్ కంపౌండ్‌లో ఏడిఈగా విధులు నిర్వహిస్తున్న శ్యాంసుందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గుర్తించిన ఏసిబి అధికారులు సైదాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 2 కోట్లకు పైగా ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కూకట్ పల్లిలో రెండు భవనాలు, సైదాబాద్ సరస్వతీ నగర్‌లో ఓ భవనం, నేరేడ్‌మెట్‌లో ఫ్లాట్, బోడుప్పల్, కొంపల్లి, కురిమెళ్ల ప్రాంతాల్లో స్థలాలు, నాగర్ కర్నూలులో 11 ఎకరాల వ్యవసాయ భూమి, నందిగామలో 36గుంటల స్థలం ఉన్నట్లు తేలింది. ఇంకా రెండు బ్యాంకుల్లోని లాకర్లు తెరవాల్సి ఉందని ఏసిబి అధికారులు తెలిపారు. సోదాల తర్వాత మొత్తం అక్రమ ఆస్తి విలువ తేలనుందని ఏసిబి డిఎస్పీ రవికుమార్ చెప్పారు. సాయంత్రం వరకు సోదాలు జరుగుతాయని చెప్పారు.
కాగా, తమకున్న ఆస్తులన్నీ సక్రమమైనవనేనని శ్యాంసుందర్ రెడ్డి, ఆయన భార్య చెప్పారు. తమ వద్ద రూ. 20 కోట్ల ఆస్తులున్నాయనడం మీడియాకు సమంజసం కాదని అన్నారు. సోదాలు జరిగినంత మాత్రాన అవినీతిపరులని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏసిబి అధికారులకు తప్పుడు సమాచారం అందడం వల్లే సోదాలు చేస్తున్నారని చెప్పారు. వారికి తాము సహకరిస్తున్నామని తెలిపారు. తన తండ్రి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడని ఆయన నుంచి తనకు కొంత ఆస్తి వచ్చిందని శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications