వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌తోపాటు ఇద్దరి ఇళ్లల్లో ఏసిబి సోదాలు: హార్డ్‌డిస్క్, డాక్యుమెంట్లు సీజ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనం రేపుతున్న ఓటుకు నోటు కేసు దర్యాప్తులో ఏసిబి మరింత వేగం పెంచింది. ఈ ఘటనలో ఆరోపణలెదుర్కొంటున్న తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మిగతా ఇద్దరు నిందితులను నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన ఏసీబీ మంగళవారం ఉదయం వారి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

మంగళవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలోనే జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం, ఎర్రగడ్డలోని సెబాస్టియన్, నాగోల్‌లోని ఉదయ్‌సింహ నివాసాలలో సోదాలు జరిపింది. ‘బాస్' నిగ్గు తేల్చేందుకు, నిందితులకు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో కొన్ని బ్యాంక్ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు, కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను పరిశీలించారు. అనంతరం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రేవంత్ పాత ఇంట్లో కూడా సోదలు నిర్వహించారు. అక్కడ ఓ కంప్యూటర్‌తో పాటు హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది.

కాగా, రేవంత్ ఇంట్లోంచి బ్యాంక్ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. రేవంత్ పాత ఇంట్లో లభించిన హార్డ్‌డిస్క్‌లో ఏముంది? ఎవరి జాతకం బయటపడనుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది. స్టీఫెన్‌సన్‌తో సంభాషణల్లోనే బాస్ విషయంలో రేవంత్‌రెడ్డి పూర్తి క్లారిటీ ఇవ్వటం, నాలుగు రోజుల పాటు ఏసీబీ ఆయనను ప్రశ్నించటం, అనంతరం ఆయన ఇంట్లో హార్డ్‌డిస్క్ లభించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

సంచలనం రేపుతున్న ఓటుకు నోటు కేసు దర్యాప్తులో ఏసిబి మరింత వేగం పెంచింది.

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

ఈ ఘటనలో ఆరోపణలెదుర్కొంటున్న తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మిగతా ఇద్దరు నిందితులను నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన ఏసీబీ మంగళవారం ఉదయం వారి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

మంగళవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలోనే జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం, ఎర్రగడ్డలోని సెబాస్టియన్, నాగోల్‌లోని ఉదయ్‌సింహ నివాసాలలో సోదాలు జరిపింది.

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

‘బాస్' నిగ్గు తేల్చేందుకు, నిందితులకు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

రేవంత్ ఇంట్లో ఏసిబి సోదాలు

ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో కొన్ని బ్యాంక్ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు, కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను పరిశీలించారు.

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

అనంతరం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రేవంత్ పాత ఇంట్లో కూడా సోదలు నిర్వహించారు. అక్కడ ఓ కంప్యూటర్‌తో పాటు హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది.

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

కాగా, రేవంత్ ఇంట్లోంచి బ్యాంక్ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

రేవంత్ పాత ఇంట్లో లభించిన హార్డ్‌డిస్క్‌లో ఏముంది? ఎవరి జాతకం బయటపడనుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

స్టీఫెన్‌సన్‌తో సంభాషణల్లోనే బాస్ విషయంలో రేవంత్‌రెడ్డి పూర్తి క్లారిటీ ఇవ్వటం, నాలుగు రోజుల పాటు ఏసీబీ ఆయనను ప్రశ్నించటం, అనంతరం ఆయన ఇంట్లో హార్డ్‌డిస్క్ లభించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

సెబాస్టియన్ ఇంట్లో సోదాలు

ముఖ్యంగా ఈ హార్డ్‌డిస్క్‌పైనే విచారణ సాగించేందుకు తాము సిద్ధమవుతున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు

ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు

రేవంత్ పాత ఇంటి ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.

ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు

ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు

ఎర్రగడ్డలోని వికాస్‌పురి కాలనీలో నివసిస్తున్న సెబాస్టియన్ ఇంటిపై దాడులు జరిపిన ఏసీబీ అధికారులు అక్కడ సెటప్ చూసి విస్తుపోయినట్టు తెలిసింది.

ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు

ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు

ఉదయ్‌సింహ ఇంట్లో ఏసీబీ అధికారులకు విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. విదేశాల నుంచి తెప్పించిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.

ముఖ్యంగా ఈ హార్డ్‌డిస్క్‌పైనే విచారణ సాగించేందుకు తాము సిద్ధమవుతున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. రేవంత్ పాత ఇంటి ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. ఎర్రగడ్డలోని వికాస్‌పురి కాలనీలో నివసిస్తున్న సెబాస్టియన్ ఇంటిపై దాడులు జరిపిన ఏసీబీ అధికారులు అక్కడ సెటప్ చూసి విస్తుపోయినట్టు తెలిసింది.

ఏసీబీ అదనపు ఎస్పీ ఉపేందర్‌శర్మ ఆధ్వర్యంలో ఇక్కడ దాడులు నిర్వహించారు. సెబాస్టియన్ ఇంటి చుట్టూ పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలుండటం వారి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, ఉదయ్‌సింహ ఇంట్లో ఏసీబీ అధికారులకు విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. విదేశాల నుంచి తెప్పించిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.

English summary
Anti-Corruption Bureau on Tuesday morning raided residence of Telangana TDP lawmaker Revanth Reddy and two others in Hyderabad in connection with the note-for-vote scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X