హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతి వేగంతో డివైడర్‌ను ఢీకొట్టిన ఎమ్మెల్యే బాలకృష్ట కారు: తప్పిన ప్రమాదం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారు బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆస్పత్రి దగ్గర ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పడంతో డైవడర్‌ను ఢీకొట్టి పైకెక్కింది.

balakrishna

ఆ వెంటనే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్‌కు ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బాలకృష్ణ కారులో లేరని తెలుస్తోంది. బాలకృష్ణ పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న ఆ ఫార్చునర్ కారు నెం. ఏపీ 02ఏవై 0001. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 accident to balakrishna's car

కాగా, ఇటీవలే జరిగిన కారుప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడిన విషయం అందరికీ తెలిసిందే.

 accident to balakrishna's car

పగలే మద్యం తాగి డ్రైవింగ్‌ ..పది మందిపై కేసు

పట్టపగలే మద్యం తాగి వాహనాలను నడుపుతున్న మందుబాబులను ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఉప్పల్‌ నల్లచెరువు వద్ద నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో 10 మంది పట్టుబడ్డట్టు ఇన్‌స్పెక్టర్‌ జంగయ్య పేర్కొన్నారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

English summary
Accident occurred at Banjarahiils in Hyderabad to MLA Nandamuri balakrishna's car, no one injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X