కారు ఢీ, రోడ్డుపై పడ్డ మహిళ: చేయిపై నుంచి దూసుకెళ్లిన బస్సు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. ముషీరాబాద్ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మహిళను కారు ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ఆ మహిళ రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న బస్సును డ్రైవర్ అప్రమత్తతో పక్కకు పోనివ్వడంతో ఆమె చేతిపై నుంచి బస్సు దూసుకెళ్లింది.

ఘటనా స్థలంలో ఆగిన బస్సు
ముషీరాబాద్ ఎస్సై సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటకు చెందిన అరుణ (35) గురువారం ఉదయం 10.30 ప్రాంతంలో ముషీరాబాద్ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు స్కూటీపై వెళ్తోంది.

గాయాలపాలైన మహిళ
ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఆమెను ఢీకొంది. అరుణ కిందపడిపోయింది.

గుమిగూడిన జనం
కాగా, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కాచిగూడ డిపో బస్సు ఆమె ఎడుమ చేతిపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె చేయికి తీవ్రగాయమైంది.

ప్రమాదానికి కారణమైన కారు
వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని ముత్తునూరి సంపత్‌తో పాటు కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications