ABP-CVoter Opinion Polls 2023: తెలంగాణలో హంగ్ తప్పదా.. ఏబీపీ సీ ఓటర్ ఓపినియన్ పోల్..

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏబీపీ సీ ఓటర్ ఓపినియన్ పోల్ 2023(ABP-CVoter Opinion Polls 2023) విడుదల చేశారు. ఈ పోల్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్(Congress) గణనీయంగా పుంజుకుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ కు 19 స్థానాలు రాగా.. ప్రస్తుత అంచనా ప్రకారం కాంగ్రెస్ 43 నుంచి 55 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇక బీఆర్ఎస్ (BRS) 49 నుంచి 61 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేసింది.

ఓట్ల పరంగా కాంగ్రెస్ గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28.3 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుత అంచనా ప్రకారం 39.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఓటింగ్ 11.1 శాతం పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ పెరుగుదల రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలను పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లతో ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ -6.4 శాతం తగ్గదలతో ఓట్లతో 40.5 శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా సర్వే అంచనా వేసింది.

 According to the ABP-CVoter Opinion Polls 2023 survey, Congress has made a huge comeback in Telangana

ప్రస్తుత ముఖ్యమంత్రి K చంద్రశేఖర్ రావుకు 37 శాతం మద్దతు తెలుపగా.. 42.4 శాతం మంది ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నారు.
ఆయన తర్వాతి స్థానాల్లో రేవంత్ రెడ్డి (ఐఎన్‌సీ) 31.2 శాతం, బండి సంజయ్ (బీజేపీ) 10.7 శాతం, అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) 2.1 శాతంతో ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి 31.2 శాతం మద్దతుతో ముందంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన బండి సంజయ్, ఇతర అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.

ఓట్ల శాతం పరంగా చూసినట్లయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క శాతం మాత్రమే తేడా ఉంది. అంటే చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీతో అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+