నాంపల్లి కోర్టు సంచలన తీర్పు: విద్యార్థిని ముద్దుపెట్టుకున్న క్లర్క్‌కు పదేళ్ల జైలు

హైదరాబాద్: పాఠశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదే స్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధినిని విచక్షణ మరచి బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఇలా చేసినందుకు గాను 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానాకు గురయ్యాడు. హైదరాబాద్‌లోని నాంపల్లి సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు గురువారం సంచలన తీర్పు చెప్పింది.

Accused haragopal sentenced to jail for 10 years

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని అమీర్ పేట పరిధిలోని వెంగళరావునగర్‌లోని నలంద పాఠశాలలో హరగోపాల్ అనే వ్యక్తి క్లర్కుగా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ లో పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.

దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 376, పోక్స్‌యాక్ట్ కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణ నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో సుదీర్ఘంగా సాగింది. నాంపల్లి సిటీసివిల్ కోర్టులో విద్యార్థిని తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వచ్చారు.

ఇటీవలే ఈ కేసులో వాయిదాలు ముగియగా, ఒకటో తరగతి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితుడు హరగోపాల్‌ను దోషిగా నిర్ధారించారు. పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+