ఎర్రచందనం కేసులో అరెస్ట్: టాలీవుడ్ లింక్స్, ఆ సినిమాలో ఫైనాన్స్?

Recommended Video

    చిత్తూరు జిల్లా లో ప్రముఖ కమెడియన్ అరెస్ట్

    చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎర్రచందనం దొంగను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతనికి టాలీవుడ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో ఆయన సినిమాలలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు.

    ఇటీవల షకలక శంకర్ సినిమాకు సదరు స్మగ్లర్ ఫైనాన్స్ చేసినట్లుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు దానిని నిర్ధారించాల్సి ఉంది. సదరు స్మగ్లర్ పలు టీవీ సీరీయళ్లలో చిన్న క్యారెక్టర్లు కూడా వేశాడని తెలుస్తోంది.

     Actor arrested, Red sandalwood smuggler arrested in Chittoor

    సదరు స్మగ్లర్ పైన ఇరవైకి పైగా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. పక్కా ఆధారాలు దొరకడంతో పోలీసులు అతని కోసం గాలించి పట్టుకున్నారని తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ ద్వారా అతను కోట్ల రూపాయలు వెనుకేశాడని తెలుస్తోంది.

    తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటకలలోని బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకొని ఎర్రచందనం విక్రయిస్తూ డబ్బు సంపాదించాడని సమాచారం. అతనితోపాటు కొందరు విద్యార్థులు, పల్లెల్లో పన ిచేసే వైద్యులు, ప్రయివేటు ఉద్యోగులు కూడా ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగమైనట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+