'ప్లీజ్ తప్పించుకో'.. ప్రియురాలు: నటుడి మృతిలో ఆసక్తికరం, మరో యువతితో సహజీవనం

హైదరాబాద్: సాధారణ కుటుంబంలో పుట్టిన వర్ధమాన నటుడు బాల ప్రశాంత్ మొదటిసారి వచ్చిన అవకాశంతో ఏకంగా ఓ సినిమాలో హీరోగా నటించారు. అయితే, వివాహేతర సంబంధం కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఓ ఎస్సెమ్మెస్ సందేశమే ఆతని ప్రాణాల మీదకు తెచ్చింది.

'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు' సినిమాలో హీరోగా నటిస్తున్న బాల ప్రశాంత్ గురువారం రాత్రి మేడ మీద నుంచి పడి మృతి చెందిన విషయం తెలిసిందే. బాల ప్రశాంత్‌కు ఓ వివాహితతో సంబంధం ఉంది. ఆమె భర్త ఊళ్లో లేకపోవడంతో గురువారం అతను ప్రియురాలి వద్దకు వెళ్లి చనిపోయాడు.

బాలప్రశాంత్, సదరు మహిళ ఇంట్లో ఉన్నప్పుడు బంధువులు వచ్చి చూడటంతో... తనను అనుమానిస్తున్నారని ఆమె చేయి కోసుకుంది. దీంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇంటికి తాళం వేయడంతో బాలప్రశాంత్ ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంట్లోనే దాక్కున్నాడు.

ఆ సమయంలో ఆమె... ఓ సందేశం పంపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 'వీలైతే ఎలాగైనా మా ఇంటి నుంచి తప్పించుకో' అని అతనికి ఆ మహిళ సందేశం పంపించింది. దీంతో బాల ప్రశాంత్ రిప్లై కూడా ఇచ్చాడు. 'అలాగే తప్పకుండా ప్రయత్నిస్తా' అని తిరిగి సందేశం పంపించాడని పోలీసులు గుర్తించారు.

Actor Bala Prashant dies in escape attempt

ఈ క్రమంలోనే అపార్టుమెంటు వెనుక వైపు నుంచి బాల్కనీ పక్కన ఉన్న డ్రైనేజీ పైపుల సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ జారికిందపడి దుర్మరణం చెందినట్లుగా తెలుస్తోంది. వివాహిత భవిష్యత్తు దృష్ట్యా పోలీసులు ఆమెను విచారించి వదిలేశారు. ప్రశాంత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సొంతూరు గుంతకల్లు తీసుకెళ్లారు.

బాల ప్రశాంత్‌కు ఆర్థిక సాయం

బాల ప్రశాంత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న సదరు మహిళ ఓ ప్రముఖ సంస్థలో పని చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో తన వేతనం డబ్బును ఎక్కువగా బాల ప్రశాంత్‌కే ఇచ్చేదంటున్నారు. ఆర్థికంగా ఆమెనే అండగా నిలిచేదని చెబుతున్నారు. ఓ కారును కూడా బహుమతిగా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

మరోవైపు, బాల ప్రశాంత్ బ్యూటీషియన్ అయిన ఓ యువతితోను సహజీవనం చేస్తున్నాడు. రెండేళ్లుగా ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఆమెతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ప్రశాంత్ లఘు చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+