'రీల్' నుంచి రియల్ ప్రేమ.. 'పక్కాప్లాన్' హీరో అరెస్టు..
నాగరాణికి ఇదివరకే పెళ్లయి ఆరేళ్ల పాప కూడా ఉంది. ఈ విషయం కూడా నగేష్ యాదవ్ కు తెలుసు. పైగా పాపను, నిన్ను బాగా చూసుకుంటానని, పెళ్లి చేసుకుంటానని నాగరాణిని నమ్మించాడు.
హైదరాబాద్: కలిసి సినిమాల్లో నటించారు. ఆపై ప్రేమలో మునిగి సహజీవనం దాకా వెళ్లారు. మోజు తీరాక సదరు ప్రేమికుడు పెళ్లికి 'నో' అన్నాడు. ఇంకేముంది వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
వివరాల్లోకి వెళ్తే.. గతేడాది సెప్టెంబరులో తెలుగులో 'పక్కా ప్లాన్' అనే చిత్రం విడుదలైంది.
కృష్ణానగర్‌కు చెందిన అల్లబోయిన ఫణీశ్వర్(32)ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాగా,
ఇందులో కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గురుమిట్కల్ మండలం మాడేపల్లి గ్రామానికి చెందిన నగేష్‌యాదవ్(28)రెండో కథానాయకుడిగా నటించాడు.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాగరాణి(29) అనే మహిళ రెండో కథానాయికిగా నగేష్ యాదవ్ సరసన నటించింది.చిత్రం సెట్స్ పై ఉండగానే నగేష్ యాదవ్-నాగరాణి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త సహజీవనానికి దారితీసింది. దీంతో మాదాపూర్ లోని ఓ ఫ్లాట్ లో వీరిద్దరు కొన్నిరోజులుగా సహజీవనం చేస్తున్నారు.
మరో విషయమేంటంటే.. నాగరాణికి ఇదివరకే పెళ్లయి ఆరేళ్ల పాప కూడా ఉంది. ఈ విషయం కూడా నగేష్ యాదవ్ కు తెలుసు. పైగా పాపను, నిన్ను బాగా చూసుకుంటానని, పెళ్లి చేసుకుంటానని నాగరాణిని నమ్మించాడు. చివరికి పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేస్తుండటంతో నాగరాణి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
నాగరాణి ఫిర్యాదు మేరకు నగేష్ యాదవ్ ను అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం కేసు విచారణ జరపుతున్నారు.












Click it and Unblock the Notifications