ప్రకాశ్ రాజ్ పదవి ఖరారు..!! సీఎం కేసీఆర్ లెక్క పక్కా - అసలు వ్యూహం ఇదే..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబాయి పర్యటన వేళ ఒక ఊహించని వ్యక్తి సడన్ గా ప్రత్యక్షమయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తో సమావేశంలో ఆ వ్యక్తి హాట్ టాపిక్ అయ్యారు. సీఎం కేసీఆర్ తనతో పాటుగా వచ్చిన వారిని పరిచయం చేసే క్రమంలో ఆ వ్యక్తిని పరిచయం చేసారు. ఆ వ్యక్తే సినీ నటుడు ప్రకాశ్ రాజ్.
Recommended Video
అనేక భాషల్లో నటించి..రాజకీయంగా ప్రధాని మోదీ విధాన పరమైన నిర్ణయాల పైన విభేదించే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు ఈ టూర్ లో చర్చకు కారణమయ్యారు. ప్రధాని మోదీ పైన..కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం ప్రారంభించిన సీఎం కేసీఆర్ తన టీంలో ప్రకాశ్ రాజ్ కు చోటు కల్పించారు.

కేసీఆర్ పర్యటనలో ప్రకాశ్ రాజ్
ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ తో టీఆర్ఎస్ కు ఉన్న సంబంధాల పైన ఎప్పుడూ చర్చ జరగలేదు. "మా" అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాశ్ రాజ్... ప్రాంతీయత పైనా చర్చ జరిగింది. ఇక, "మా" ఎన్నికలు ముగిసిన తరువాత ఆయన తిరిగి సినిమాల్లో బిజీగా మారారు. ప్రకాశ్ రాజ్ గతంలో బెంగుళూరు నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు.
కొంత కాలం క్రితం మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ భేటీకి కేసీఆర్, ప్రకాష్‌రాజ్‌ను కూడా తీసుకెళ్లారు. ఇదిగో ఇప్పుడు కూడా ముంబై పర్యటనలో ప్రకాష్‌రాజ్‌కు చోటు కల్పించారు. ఇక, ఉద్దవ్ థాక్రేతో భేటీ పూర్తయిన తరువాత కేసీఆర్ తన కారులోనే ప్రకాశ్ రాజ్ తో కలిసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దగ్గరకు వెళ్లారు.

ప్రకాశ్ రాజ్ కు కీలక బాధ్యతలు
ఇదే సమయంలో టీఆర్ఎస్ లో అసలు విషయం ఏంటనే దాని పైన చర్చ ప్రారంభమైంది. కేంద్రం పైన పోరాటంలో సీఎం కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకాశ్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీపై, బీజేపీ నేతలపై ప్రకాశ్ రాజ్ విమర్శలు సంధిస్తున్నారు.
ప్రకాష్ రాజ్‌ను బీజేపీ పైన తాను చేస్తున్న పోరాటంలో భాగస్వామిని చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాజకీయ నేతలతో ప్రకాష్‌రాజ్‌కు మంచి సంబంధాలున్నాయి. తన ఆలోచనలను ఆచరణ రూపంలో తెచ్చేందుకు ప్రకాష్‌రాజ్ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ టీఆర్ఎస్ లో వినిపిస్తోంది.

సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారా
అందులో భాగంగా.. ప్రకాశ్ రాజ్ కు టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్ రాజ్యసభకు రాజీనామా చేసారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. ఆ సీటుతో పాటుగా ఈ ఏడాది జూన్ లో టీఆర్ఎస్ ఇద్దరు సభ్యులు లక్ష్మీకాంత రావు...డీ శ్రీనివాస్ పదవీ విరమణ చేయనున్నారు. వీటిలో ఒకటి ప్రకాశ్ రాజ్ కు కేటాయించి..ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక.. కేసీఆర్, స్టాలిన్ భేటీ వెనుక ప్రకాష్‌రాజ్ కీలకం కానున్నారని చెబుతున్నారు.

ప్రధాని మోదీ వ్యతిరేక పోరాటంలో
స్టాలిన్‌తో ప్రకాష్‌రాజ్‌కు మంచి సంబంధాలున్నాయి. మొదటి నుంచి సెక్యులరిజం భావజాలం పట్ల ప్రకాష్‌రాజ్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందువల్లే స్టాలిన్‌కు ప్రకాష్‌రాజ్ దగ్గరయ్యారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న కూటమిలో ప్రకాష్‌రాజ్ రానున్న రోజుల్లో కీలకంగా మారనున్నారనేది ముంబాయి పర్యటనలో కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత ద్వారా స్పష్టం అవుతోంది. దీంతో..ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వ్యవహారం అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications