మహేష్ కత్తి సంచలన విషయం చెప్పిన నిర్మాత, రేపు మరిన్ని: కత్తి ఇంటికి పవన్ ఫ్యాన్స్

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో నానుతున్న, తనకు హైప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ కత్తిపై నటుడు, నిర్మాత రాంకీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మహేష్ కత్తి గురించి సంచలన విషయాలు ఆయన బయటపెడుతున్నారు.

మహేష్ కత్తి పదేపదే పవన్‌ను టార్గెట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఒక్కరినే టార్గెట్ చేయడంపై విమర్శలు రావడంతో ఆయన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, చంద్రబాబు, మోడీలపై విమర్శలు గుప్పించారు.

మాటలు చెప్పడంలో దిట్ట

మాటలు చెప్పడంలో దిట్ట

ఈ నేపథ్యంలో నటుడు, నిర్మాత రాంకీ మరోసారి మహేష్ కత్తి గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. మహేష్ కత్తిని మోహన్ రావిపాటి తనకు పరిచయం చేశారని, కత్తికి మాటలు చెప్పడంలో మంచి ప్రావీణ్యం ఉందని విమర్శించారు. ఇతరులు నమ్మేవిధంగా మాటలు చెప్పడంలో దిట్ట అన్నారు. అందుకే అతని మాటలను అందరూ నమ్ముతారని చెప్పారు.

కత్తి ఉమనైజర్

కత్తి ఉమనైజర్

మహేష్ కత్తికి మాటలు మాత్రమే తెలుసునని, ఆయనకు తాను అవకాశం ఇచ్చి తప్పు చేశానని రాంకీ అన్నారు. ఆయన ఇండస్ట్రీకి ఓ చీడపురుగు అన్నారు. అమ్మాయిలకు మహేష్ కత్తి అసభ్యకరమైన సందేశాలు పెట్టినట్లుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కత్తి ఉమనైజర్ అన్నారు.

 మహేష్ కత్తి గురించి మరిన్ని విషయాలు బయటపెడ్తా

మహేష్ కత్తి గురించి మరిన్ని విషయాలు బయటపెడ్తా

మహేష్ కత్తికి డైరెక్షన్ గురించి ఏమాత్రం తెలియదని రాంకీ చెప్పారు. మహేష్ కత్తి గురించి మరిన్ని సంచలన విషయాలు ఉన్నాయని, వాటన్నింటిని తాను గురువారం బయటపెడతానని మండిపడ్డారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని సూచించారు.

 మహేష్ కత్తి తండ్రిని కలిసిన పవన్ ఫ్యాన్స్

మహేష్ కత్తి తండ్రిని కలిసిన పవన్ ఫ్యాన్స్

ఇదిలా ఉండగా, పవన్ అభిమానులు మహేష్ కత్తి సొంతూరు వెళ్లి ఆయన తండ్రిని కలిసినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ పత్రికలో కథనం వెలువడింది. ఈ విషయాన్ని మహేష్ కత్తి ఓ ట్వీట్ చేశారు.

మా ఇల్లు టౌన్లోనో, ఒంటరిగా ఉండి ఉంటే

మా ఇల్లు టౌన్లోనో, ఒంటరిగా ఉండి ఉంటే

మా పల్లెకు వచ్చి, మా ఇంటికి వచ్చి, తన తండ్రిని మర్యాదపూర్వకంగా కలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎందుకు వచ్చిందని, అదే, మా ఇల్లు మా వాళ్లు ఉండే పల్లెలో కాకుండా ఏ టౌన్ లోనో, ఒంటరిగా అయి ఉంటే అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+