ఫార్చునర్ కారును ఢీకొట్టిన హీరో రాజశేఖర్: ఆ డిప్రెషన్ వల్లే ప్రమాదం..
రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును రాజశేఖర్ కారు ఢీకొట్టింది.
హైదరాబాద్: సినీ నటుడు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం అర్ధ రాత్రి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘటన చోటు చేసుకుంది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న సమయంలో.. రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును రాజశేఖర్ కారు ఢీకొట్టింది.
ప్రమాద ఘటనలు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. తన కారును ఢీకొట్టడంతో ఆగ్రహం చెందిన రామిరెడ్డి రాజశేఖర్ తో వాగ్వాదానికి దిగారు. మద్యం సేవించి కారునడిపాడని రామిరెడ్డి రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజశేఖర్ కు బ్రీత్ అన్‌లైజర్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు అలాంటిదేమి లేదని తేల్చారు. రాజశేఖర్ మద్యం సేవించి డ్రైవ్ చేయలేదని, ఇటీవలే తల్లి చనిపోవడంతో ఆ డిప్రెషన్ లో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి రామిరెడ్డితో రాజీ కుదుర్చుకోవడంతో గొడవ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications