అలాంటి వ్యక్తులు: పవన్ కళ్యాణ్ రాజకీయాలపై నటుడు రానా కామెంట్స్
హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు రాజకీయాల్లో రాణిస్తారని ప్రముఖ నటుడు రానా అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సినిమా వాళ్లు ఏ రంగంలో అయినా రాణిస్తారని చెప్పారు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరు కూడా లెజెండ్స్ అన్నారు. తమకు నచ్చిన మార్గాలను వారు ఎంచుకున్నారని ఆయన చెప్పారు. వారు ఎంతో ప్రభావితం చేయగల వ్యక్తులు అన్నారు.
Recommended Video


రాజకీయాల్లోకి రాను
భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి వస్తారా అని రానాను ప్రశ్నిస్తే ఆయన నో చెప్పారు. రాజకీయ నాయకుడి పాత్రలలో సినిమాలలో నటించడమే తప్ప నిజ జీవితంలో రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు.

టాలీవుడ్ మద్దతు
పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ, వరుణ్ తేజ, సాయిధరమ్ తేజ, కోన వెంకట్ తదితరులు జనసేనానికి మద్దతుగా ట్వీట్లు చేశారు. మీము కూడా మీ వెంటే అంటూ చెబుతున్నారు.

రాజకీయాల్లో తనవంతుగా
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి తనవంతుగా సేవ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆయన ప్రశ్నిస్తే ఏపీ ప్రభుత్వం స్పందిస్తోన్న విషయం తెలిసకిందే. ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఆలోచన వెనుక రహస్యం ఏమిటో
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొగడటం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియదని, ఎవరు ఎవరితో ఎప్పుడు కలిసి వెళ్తారో ఇప్పుడే చెప్పలేమని టీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications