హర్షితతో రాజీకి సిద్ధం: తల్లి, చిన్న మెసేజ్ వల్ల కష్టపెట్టింది: సామ్రాట్, 14 రోజుల రిమాండ్
Recommended Video

హైదరాబాద్: హర్షిత తన కొడుకును మానసింగా హింసించిందని నటుడు సామ్రాట్ రెడ్డి తల్లి జయా రెడ్డి అన్నారు. హర్షిత కుటుంబ సభ్యులతో రాజీకి తాము సిద్ధమని చెప్పారు. పెళ్లయినప్పటి నుంచి తన కొడుకు నరకం అనుభవిస్తున్నాడని వాపోయారు.
తన కొడుకు సామ్రాట్ రెడ్డి సినిమాల్లో నటించడం హర్షితకు ఇష్టం లేదని చెప్పారు. మానసికంగా హింసించారన్నారు. తన కొడుకు ఎవరితో మాట్లాడినా హర్షిత అనుమానించేదని ఆరోపించారు.

చిన్న మెసేజ్ వల్ల నా భార్య వేధించింది
అంతకుముందు, సామ్రాట్ కూడా హర్షిత ఆరోపణలను కొట్టి పారేశారు. ఒక చిన్న మెసేజ్ వల్ల తన భార్య తనను నానా కష్టాలు పెట్టిందని ఆరోపించారు. తాను ఆమెను వేధించలేదని చెప్పారు. తన భార్యే తనను వేధించిందన్నారు. ఆమెతో సర్దుబాటుకు తాను ప్రయత్నించానని, కానీ వాళ్ల డిమాండ్స్ భారీగా ఉన్నాయని సామ్రాట్ చెప్పారు. అంత ఇచ్చుకునే స్థోమత తన వద్ద లేదన్నారు.

సామ్రాట్‌కు 14 రోజుల రిమాండ్
ఇదిలా ఉండగా, నటుడు సామ్రాట్‌ను పోలీసులు సాయంత్రం ఐదు గంటల సమయంలో మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. అతనికి న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విదించింది. ట్రెస్ పాస్, చోరీ ఐపీసీ సెక్షన్ 380, 427 ఆర్/డబ్ల్యు, 201 కింద కేసులు నమోదు చేశారు.

బెయిల్ పిటిషన్ దాఖలు
మరోవైపు, సామ్రాట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు బుధవారానికి వాయిదా పడింది. రేపటి తీర్పు కోసం ఆసక్తి నెలకొంది.

భార్య, అత్తమామల తీవ్ర ఆరోపణలు
కాగా, హైదరాబాద్: సామ్రాట్‌పై అతని అత్తమామలు, భార్య తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన భర్త సామ్రాట్‌కు ఇతర అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, మాదకద్రవ్యాలు కూడా వాడుతున్నారని భార్య హర్షిత ఆరోపించారు. వివాహం అయినప్పటి నుంచి కట్నం కోసం తనను తీవ్రంగా వేధించడమే కాకుండా చిత్రహింసలు పెట్టే వాడని ఆమె కంటతడి పెట్టారు. సినిమాల్లో నటించనని చెప్పిన తర్వాతనే తన కూతురిని సామ్రాట్‌కిచ్చి వివాహం చేశానని హర్షితా తండ్రి కృష్ణారెడ్డి తెలిపారు. తన కూతురికి ప్రాణహాని ఉందన్నారు. ఈ నెల 25న తన కూతురు ఇంట్లోలేని సమయం చూసి సామ్రాట్ తాళాలు పగులకొట్టి వస్తువులు చోరీ చేశాడని ఆరోపించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications