తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో చెప్పకనే చెప్పిన నటుడు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపించింది. పోలింగ్‌కు ఇంకో రెండు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. చివరి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.

30వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

Actor Uttej urged to the voters to vote proper party

ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ నటుడు ఉత్తేజ్.. తెర మీదికి వచ్చారు. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. బంగారు తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని విజ్ఞప్తి చేశారు.ఓటు అనే ఆయుధాన్ని ప్రాపర్‌గా డ్రైవ్ చేయాలంటూ చేతిని స్టీరింగ్‌లా తిప్పారు.

ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఉత్తేజ్. ఎవ్వరినో గెలిపించడానికి ఓటు వేయాల్సిన అవసరం లేదని, మనల్ని మనం గెలిపించుకోందామని పిలుపునిచ్చారు.

Actor Uttej urged to the voters to vote proper party

రాష్ట్రపతి సంతకానికి ఎంత విలువ ఉంటుందో.. మనం వేసే ఓటుకూ అంతే శక్తిమంతమైనదని వ్యాఖ్యానించారు. మన కోసం పని చేసే వారికి, మనకు సరైన దిశానిర్దేశం చేసే వారికి ఓటు వేద్దామని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇంత పచ్చగా ఉందంటే.. అయిదేళ్ల కిందట మనం వేసిన ఓటు వల్లేనని, రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందుతోందంటే పదేళ్ల కిందట వేసిన ఓటే దీనికి కారణమని అన్నారు.

సమయానుకూల దేశభక్తుల మాటలకు తల ఊపొద్దని, తాత్కాలిక గారడీలు, మేజిక్కులకు మోసపోవద్దని ఉత్తేజ్ విజ్ఞప్తి చేశారు. బిర్యానీ పొట్లం ఇచ్చే వాడికి కాదని, పంట పొలాలను పచ్చగా సస్యశ్యామలం చేసే వారికి ఓటు వేయాలని అన్నారు. మందు బాటిల్ ఇచ్చే వాడిని నమ్మొద్దని, చెరువులను తవ్వి, ప్రాజెక్టులను కట్టే నాయకుల గురించి ఆలోచించాలని సూచించారు.

Actor Uttej urged to the voters to vote proper party

తెలంగాణ రావడం కలగా అభివర్ణించిన వారి దిమ్మ తిరిగేలా ఎన్నికల ఫలితం రావాలని ఉత్తేజ్ కోరారు. తెలంగాణ ప్రజల కష్టం గురించి, తెలిసిన వారికి, దాన్ని తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తోన్న నాయకులకే ఓటు వేద్దామని, బంగారు తెలంగాణను కాపాడుకుందామని ఉత్తేజ్ సూచించారు. ఈ వీడియోకు కేటీఆర్ స్పందించారు. థ్యాంక్స్ ఉత్తేజ్ అంటూ రిప్లై ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+