స్టార్ హోటల్లో సినీ నటి వ్యభిచారం, అడ్డంగా దొరికిన వైనం

హైదరాబాద్: సెక్స్ రాకెట్లో నటీ నటులు దొరకడం కొత్తేం కాదు. పలు సందర్భాల్లో నటీమణులు సెక్స్ స్కాండల్లో దొరకడం వింటూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఇందులో పట్టుబడింది.

శనివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులలో బాలీవుడ్ నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈ సంఘటన హైదరాబాదులోని ఓ హోటల్లో చోటు చేసుకుంది.

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు

హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌పై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ బాలీవుడ్‌ నటి వ్యభిచారం చేస్తూ అధికారులకు పట్టుబడింది. సదరు నటి శుక్రవారం ముంబై నుంచి హైదరాబాద్‌ వచ్చినట్లు గుర్తించారు.

ఆన్ లైన్ వ్యభిచారం

ఆన్ లైన్ వ్యభిచారం

ఆన్‌లైన్‌ ద్వారా ఈ వ్యభిచార వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వ్యభిచార నిర్వహకుడు కడాకియాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

ధనవంతుల పిల్లలను ఆకర్షిస్తూ లక్షలు వసూలు

ధనవంతుల పిల్లలను ఆకర్షిస్తూ లక్షలు వసూలు

ధనవంతుల పిల్లలను ఆకర్షిస్తూ రాత్రికి రూ.లక్ష నుంచి అంతకంటే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. సినీ నటి, నిందితుడితో పాటు పోలీసులు రూ.50 వేల నగదును సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వివరాలు రాబడుతున్నారు

మరిన్ని వివరాలు రాబడుతున్నారు

కాగా, వ్యభిచార నిర్వాహకుడు కడాకియా కాస్ట్యూమ్ డిజైనర్‌గా తెలుస్తోంది. హోటల్ మేనేజర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+