Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా సోదరుడు ఆసుపత్రిలో ఉన్నాడు.. నోట్ల మార్పిడితో అతనికి సంబంధం లేదు: జీవిత

పాత నోట్ల మార్పిడికి పోస్టాఫీసులు, డీసీసీబీ(జిల్లా కార్పోరేషన్ బ్యాంకు)లలో ఆర్బీఐ మరో నెల రోజులపాటు అవకావం కల్పించిన నేపథ్యంలో.. శ్రీనివాసరావు తన వద్దనున్న రూ.5కోట్లను మార్చడానికి ప్రయత్నించినట్లు తెల

హైదరాబాద్: పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో తమ సమీప బంధువును అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలపై సినీ నటి జీవిత స్పందించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తమ వద్ద పనిచేస్తారని, రవి అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదని జీవిత అన్నారు. నోట్ల మార్పిడి వ్యవహారంతో తన సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం తన సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

కాగా, గురువారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సినీ నటి జీవిత సమీప బంధువైన శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం జరిగింది. రవి అనే మరో వ్యక్తితో కలిసి రూ.7కోట్ల విలువ చేసే పాత కరెన్సీ నోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతంలోను శ్రీనివాసరావు అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో అరెస్ట్ అయినట్లు సమాచారం.

actress jeevita relative srinivasarao arrested

కాగా, పాత నోట్ల మార్పిడికి పోస్టాఫీసులు, డీసీసీబీ(జిల్లా కార్పోరేషన్ బ్యాంకు)లలో ఆర్బీఐ మరో నెల రోజులపాటు అవకావం కల్పించిన నేపథ్యంలో.. శ్రీనివాసరావు తన వద్దనున్న రూ.5కోట్లను మార్చడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నారన్న సమాచారం అందగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన ఇంటిపై దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు పోలీసుల అదుపులోనే ఉండగా.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+