తెలుగులో కొత్త చానెల్: నటి రంజిత నిత్యానంద స్వామి పాఠాలు?

హైదరాబాద్: స్వామి నిత్యానందతో రాసలీలల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కున్న సినీ నటి రంజిత గురించి ఇటీవల ఏ విధమైన వార్తలూ రావడం లేదు. అయితే, ఆమె తన భక్తి పాఠాలతో తెలుగు ప్రజలను రంజింపజేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

నిత్యానంద స్వామికి రంజిత అనుంగు శిష్యురాలనే విషయం తెలిసిందే. దసరా నాటికి ప్రారంభమయ్యే ఓ టీవీ చానెల్‌లో రంజిత దర్శనమివ్వబోతుందని సమాచారం. నిత్యానంద ప్రవచనాలను, ఆయనను ప్రమోట్ చేసే విధంగా ఆ టీవీ చానెల్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Actress Ranjitha may appear in newly launched channel

ఆ భక్తి చానెల్‌ను సూర్య దినపత్రిక అధినేత నూకారపు సూర్యనారాయణ నిర్వహిస్తారట. ఆయన నిత్యానంద స్వామి భక్తుడని చెబుతున్నారు. తెలుగులో ప్రారంభమయ్యే భక్తి చానెల్‌ను రంజిత డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. నూకారపు సత్యనారాయణ ఇటీవల బెంగుళూరు శివారులోని నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి భక్తి టీవీ చానెల్ ప్రారంభంపై చర్చలు జరిపినట్లు వినికిడి.

ఆ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ నిజమైతే మాత్రం రంజిత తెలుగులో పాపులర్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆమె గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటిచంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+