గులాబీ కండువా కప్పుకోనున్న అలనాటి అందాల తార

హైదరాబాద్: సినిమాల్లో బాపు గీసిన బొమ్మ, అలనాటి అందాల తార, ముత్యాలముగ్గు సినిమా ఫేమ్ సంగీత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరాలనే ఆసక్తి చూపుతున్నారు. గతంలో రాజకీయాల్లోకి రావాలని సాలా మంది తనను ఆహ్వానించారని, అయితే తాను ఆసక్తి చూపలేదని, ఇప్పుడు తెరాసలో చేరాలని అనుకుంటున్నానని ఆమె చెప్పారు.

తమిళ, మలయాళ సినిమాల్లో, సీరియల్స్‌లో ఎక్కువగా నటించడం వల్ల తాను చెన్నైలో స్థిరపడ్డానని ఆమె అన్నారు. అందువల్ల తెలుగు చిత్రపరిశ్రమకు దురమయ్యానని ఆమె అన్నారు. నటిగా మంచి గుర్తింపునిచ్చి మాతృభాఠరగ ఎందుకు దూరం కావాలనే ఆలోచన రావడంతో హైదరాబాద్ వచ్చేశానని చెప్పారు.

సరదాగా ఉండే అమ్మ పాత్రలతో పాటు తన వయసుకు తగిన అన్ని తరహా పాత్రల్లో నటించాలని ఉందని సంగీత అన్నారు. ముత్యాలముగ్గు సంగీతగా ఆమె తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు ఆమె. తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కూడా ఆమె అనుకుంటున్నారు.

Actress Sangeetha wants join in TRS

తమ సొంతూరు వరంగల్ అని ఆమె చెప్పారు. బాపు, విశ్వేశ్వర రావుల ఆశీర్వాదంతో నటిగా మంచి గురతింపు తెచ్చుకున్నట్లు ఆమె చెప్పారు. తెలుగులో వంద సినిమాకు పైగా నటించాని, తన తొలి తెలుగు సినిమా తీర్పు అని, కానీ ముత్యాల ముగ్గు ముందుగా విడుదలైందని ఆమె చెప్పిట్లు సాక్షి మీడియా రాసింది.

హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాదిలో 600లకు పైగా సినిమాల్లో నటించానని ఆమె చెప్పారు. భవిష్యత్తులో నిర్మాతగా మారే అవకాశాలున్నాయని ఆమె చెప్పారు. దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదని సంగీత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+