సినీ నటి, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మలకు కోటీ టోకరా
హైదరాబాద్: సూపర్‌స్టార్ హీరో కృష్ణ సతీమణి, సీనియర్ దర్శకురాలు, సినీ నటి విజయనిర్మలను రియల్‌ఎస్టేట్ వ్యాపారులు మోసం చేసినట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి. వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నామంటూ నమ్మించి కొందరు మోసం చేశారు.
హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్న విజయనిర్మలకు బంజారాహిల్స్ రోడ్ నెం1లోని విజన్ మెడోస్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు చెందిన నిర్వాహకులు ఆర్ శ్రీనివాసరాజు, ముదునూరి భధ్రిరాజు, శ్రీరామరాజులతో 20 ఏళ్లుగా పరిచయం ఉంది. వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చేబదులుగా రూ.కోటి ఇస్తే తమ కష్టాలు తీరుతాయని ఆమెను నమ్మించారు.

వీరి మాటలను నమ్మిన విజయనిర్మల 2007లో వారికి డబ్బులు ఇచ్చారు. కాగా, వారు అనుకున్న సమయానికి డబ్బులు చెల్లించకపోగా కాలయాపన చేస్తూ వచ్చారు. విసిగిపోయిన ఆమె రియల్టర్లు ఇచ్చిన చెక్కులను బ్యాంకులో జమచేయగా అవి బౌన్స్ అయ్యాయి.దీంతో విజయనిర్మల కోర్టును ఆశ్రయించారు.
డబ్బులు తీసుకుని కాలయాపన చేస్తున్న ఆర్‌శ్రీనివాసరాజు, భద్రిరాజు, శ్రీరామరాజులపై కేసు నమోదు చేయాలని సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వీరిపై ఐపీసీ 406,420,156(సీఆర్‌పీసీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !!












Click it and Unblock the Notifications