పవన్‌ కళ్యాణ్‌, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన విజయశాంతి!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సీఎం కేసీఆర్‌పై విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్‌‌కల్యాణ్‌‌ను టూరిస్ట్ అన్న కేసీఆర్..ఇప్పుడెలా యాత్ర చేసుకోమని వీసా ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సీఎం కేసీఆర్‌పై విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్‌‌కల్యాణ్‌‌ను టూరిస్ట్ అన్న కేసీఆర్..ఇప్పుడెలా తెలంగాణలో యాత్ర చేసుకోమని వీసా ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు.

Recommended Video

    తెలంగాణలో పవన్ టూర్.. ఎదురొచ్చి హారతిచ్చిన భార్య..!

    సకల జనుల సర్వే సమయంలో జనసేనానిని తెలంగాణ సీఎం టూరిస్ట్‌గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ విజయశాంతి తాజాగా విమర్శలు గుప్పించారు.

    vijayasanthi-pawan


    తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ నేతలు కోదండరాం, ఇతర నేతలకు కూడా పవన్‌ మాదిరిగా వీసాలిస్తే కనీసం వారికి తెలంగాణలో ఉన్నామన్న భావన కలుగుతుందని విజయశాంతి సెటైర్లు వేశారు.

    పవన్‌కల్యాణ్ లాంటి టూరిస్ట్‌ నేతకు ఇచ్చిన స్వేచ్ఛను ఉద్యమ నేతలకు ఇవ్వకపోవడం శోచనీయమని ఆమె వ్యాఖ్యానించారు. జేఏసీ నేతలను నిర్బంధిస్తున్న తీరును చూస్తుంటే తెలంగాణ బిడ్డల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతుందని విజయశాంతి ఆవేదన వ్యక్తంచేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+