సీనియర్ నేతలే ఇలా మాట్లాడితే ఎలా?: మర్రి శశిధర్ రెడ్డిపై అద్దంకి దయాకర్

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ ఆగడం లేదు. మరోవైపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా ఆ పార్టీ సినయర్ నేతలు విమర్శనాత్మక వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, రేవంత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ తీరుపై సీనియర్ నేత శశిధర్ రెడ్డి చేసిన విమర్శలపై అద్దంకి దయాకర్ స్పందించారు.

ఆలోచించి మాట్లాడాలంటూ మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి దయాకర్

ఆలోచించి మాట్లాడాలంటూ మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి దయాకర్

మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. పీసీసీ, మాణికం ఠాగూర్ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. తాము చేసిన వ్యాఖ్యలను పెద్దవి కాకుండా సద్దుమణిగేలా చేయాల్సినవారు, పార్టీకి సలహాలు ఇవ్వాల్సిన సీనియర్లే ఈ విధంగా విమర్శలు చేయడం మంచిది కాదన్నారు.

బీజేపీ కుట్రలో భాగం కావద్దంటూ అద్దంకి దయాకర్

బీజేపీ కుట్రలో భాగం కావద్దంటూ అద్దంకి దయాకర్

బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రల్లో కాంగ్రెస్ పావులుగా మారుతున్నట్లుగా అనిపిస్తోందని అద్దంకి దయాకర్ అన్నారు. పీసీసీని ఇలా అంటే పార్టీకే నష్టమని, ఏదైనా ఉంటే చూసుకోవడానికి పీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీలు ఉన్నాయన్నారు. తనపైనా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే తాను స్పందిస్తున్నానని.. రేవత్ రెడ్డి చెబితే కాదని దయాకర్ స్పష్టం చేశారు.

మాణికం ఠాగూర్, రేవంత్ రెడ్డి లక్ష్యంగా మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్

మాణికం ఠాగూర్, రేవంత్ రెడ్డి లక్ష్యంగా మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్

అయితే, రేవంత్ రెడ్డి, మాణికం ఠాగూర్ పై బుధవారం శశిధర్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. రేవంత్, మాణికం ఠాగూర్ లు అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులుగా ఉంటూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా దిశానిర్దేశం చేయాల్సిన మాణికం ఠాగూర్.. రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరులు(వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి) విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్రంగా కలత చెందుతున్నానని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు రేవంత్ వ్యవహారంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+