టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. మ్యాథ్స్ పేపర్‌లో అదనంగా 6 మార్కులు
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌లో దొర్లిన తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు తీపి కబురు అందింది. తప్పులు దొర్లిన ప్రశ్నలకు అదనపు మార్కులు కలపాలని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. పరీక్షల్లో తప్పుగా ఉన్న ప్రశ్నలకు సమాధానం రాసే ప్రయత్నం చేసిన విద్యార్థులందరికీ ఆరు మార్కులు కలుపుతామని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
టెన్త్ మ్యాథ్స్ పేపర్ 1లో ఐదున్నర మార్కులు, పేపర్ 2లో అరమార్కు కలపనున్నారు. టెన్త్ పేపర్ 1లోని పార్ట్ ఏ లో ఆరో ప్రశ్నకు ఒకమార్కు, 16వ ప్రశ్నకు 4 మార్కులు, పార్ట్ బీలోని 7వ ప్రశ్నకు అరమార్కు, పేపర్ 2 పార్ట్ బీలో 4వ ప్రశ్నకు అరమార్కు యాడ్ చేయనున్నారు.

మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌లోని తప్పులను తెలంగాణ మ్యాథ్స్ ఫోరం గుర్తించింది. ఈ విషయాన్న సంస్థ వర్కింగ్ ప్రెసిడెట్ తాడ్వాయి శ్రీనివాస్ పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన అధికారులు విద్యార్థులకు అన్యాయం జరగకుండా తప్పులు దొర్లిన ప్రశ్నలకు ఆరు మార్కులు కలపాలని నిర్ణయించారు.

Click it and Unblock the Notifications