Adilabad Airport: నీటి ప్రవాహాన్నే పక్కకు తిపుతున్నారు.. మూడు వాగుల డైవర్షన్ ప్లాన్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన విమానాశ్రయ నిర్మాణ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అవసరమైన 2,009 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కాగా, తాజాగా మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రతిపాదిత విమానాశ్రయ భూమి గుండా ప్రవహిస్తున్న మూడు వాగులను దారి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ రూ.324 కోట్ల భారీ అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా రన్‌వేపైకి చుక్క నీరు రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

రెండు భారీ కాలువల నిర్మాణం.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

విమానాశ్రయాన్ని వరద ముప్పు నుంచి పూర్తిగా రక్షించేందుకు ఎస్ఈ ప్రభుకల్యాణ్ ఆధ్వర్యంలో అధికారులు నెలల తరబడి కసరత్తు చేసి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతిపాదిత స్థలంలో మొత్తం 5.4 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న వాగులను బయటకు మళ్లించేందుకు రెండు కొత్త కాలువలను తవ్వనున్నారు. ఇందులో భాగంగా బృందావన కాలనీ, కేఆర్‌కే కాలనీ వైపు నుంచి వచ్చే నీటిని మళ్లించడానికి రూ.57.49 కోట్లతో 2.67 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మిస్తారు. దీనిని ఇందిరమ్మ కాలనీ, కచ్‌కంటి రోడ్డు మీదుగా తీసుకెళ్లి చించుఘాట్ నుంచి వచ్చే మెట్ట వాగులో కలుపుతారు.

Adilabad Airport Project Gains Momentum as Tenders Invited for Rs 324 Crore Stream Diversion Canal Works
 మామునూరు, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలకు పేర్లు ఖరారు- వారి మాటకే మొగ్గు..!!
మామునూరు, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలకు పేర్లు ఖరారు- వారి మాటకే మొగ్గు..!!

రన్‌వేకు రక్షణగా రూ.267 కోట్లతో మరో కాలువ!

ప్రతిపాదిత రన్‌వే ప్రాంతంలో 3.2 కిలోమీటర్ల మేర ప్రవహించే చించుఘాట్ వాగు మళ్లింపు కోసం ఏకంగా రూ.267.23 కోట్లు కేటాయించారు. బంగారుగూడ వంతెన కింద నుంచి అనుకుంట గ్రామం వెనుక భాగంగా ప్రవహించే ఈ వాగు కోసం 4.5 కిలోమీటర్ల పొడవైన భారీ కాలువను తవ్వనున్నారు. దీనిని టాక్లీ గ్రామ శివారు నుంచి మళ్లించి, నేరుగా సాత్నాల ప్రాజెక్టు వాగులో కలిపేలా డిజైన్ చేశారు. దీనివల్ల సమీపంలోని ఖానాపూర్ చెరువు కట్టకు కూడా వరద ముప్పు లేకుండా రక్షణ కల్పించనున్నారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు స్పీడప్.. ముగ్గురు కేంద్రమంత్రుల నిర్ణయం!
ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు స్పీడప్.. ముగ్గురు కేంద్రమంత్రుల నిర్ణయం!

హైగ్రేడ్ కాంక్రీటుతో పటిష్టమైన రక్షణ గోడలు

ఎంతటి భారీ వరదలు వచ్చినా విమానాశ్రయ సరిహద్దుల్లోకి నీరు చేరకుండా ఉండేందుకు అధునాతన సాంకేతికతతో కాలువలు నిర్మిస్తున్నామని నీటిపారుదల శాఖ ఏఈఈ సాగర్ తెలిపారు. కాలువల గట్లు కోతకు గురికాకుండా ఉండేందుకు హైగ్రేడ్ కాంక్రీటుతో పటిష్టమైన రక్షణ గోడలు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా విమానాశ్రయాల నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేయడంతో, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+