Sankrantiకి ఇంటికి వెళదాం అనుకుంటున్నారా: రైల్వే టికెట్ బుకింగ్ కు ఇదే రైట్ టైం
ఇంకో రెండు నెలల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొనబోతోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమౌతోన్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో నివసించే తెలుగువాళ్లందరూ సొంతూర్లకు ప్రయాణంకట్టడం ఆనవాయితీగా వస్తోంది.
సంక్రాంతికి ఇంటికి వెళ్లాలనుకునే వారు ఇక రైలు టికెట్ల బుకింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. 60 రోజుల ముందే రైలు టికెట్లను బుక్ చేసుకునే వెసలుబాటు అందుబాటులో ఉంది. దీనివల్ల పండగ తేదీలకు సరిగ్గా 60 రోజుల ముందు IRCTC వెబ్ సైట్ లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక రైళ్ల కోసం ఎదురుచూడకుండా ఈ 60 రోజుల గడువును ఉపయోగించుకుని అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ చేసుకోవడం వల్ల ఏపీకి వెళ్లే రైళ్లల్లో బెర్తులను సులభంగా పొందవచ్చు.

టికెట్ల బుకింగ్ లో ఆలస్యం చేస్తే ప్రయాణికులు దానికి తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పకపోవచ్చు. బెర్త్ లభించకపోతే రైలు ప్రయాణం ఎంత భయానకంగా ఉంటుందో.. దసరా, దీపావళి రోజుల్లో చూశాం. కాలు పెట్టడానికి కూడా వీలు లేనంతగా జనరల్ బోగీలు క్రిక్కిరిసిపోతుంటాయి. అలాగనీ ప్రైవేట్ బస్సుల మీద డిపెండ్ కాలేం. వేలకు వేల రూపాయలను ఛార్జీల రూపంలో వసూలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనీస టికెట్ 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఉండొచ్చు. అందుకే ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది.
- సంక్రాంతి పండగకు రైలు టికెట్ల బుకింగ్ ఈ నెల 13 నుండి ప్రారంభమౌతుంది. జనవరి 12వ తేదీన ప్రయాణానికి సంబంధించి.. 60 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే నిబంధన ప్రకారం ఈ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
- జనవరి 13వ తేదీ ప్రయాణానికి ఈ నెల 14వ తేదీన బుకింగ్ మొదలవుతుంది.
- జనవరి 14వ తేదీ ప్రయాణానికి ఈ నెల 15వ తేదీన బుకింగ్ మొదలవుతుంది.
- జనవరి 15వ తేదీ ప్రయాణానికి ఈ నెల 16వ తేదీన బుకింగ్ మొదలవుతుంది.












Click it and Unblock the Notifications