తెలంగాణకు మరో భారీ పెట్టుబడి: రూ. 16వేల కోట్లతో అడ్వెంట్ ఇంటర్నేషన్, కేటీఆర్ హ్యాపీ

హైదరాబాద్: తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వరుస కడుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ, ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూలో ఉండగా.. మరో దిగ్గజ సంస్థ కూడా ముందుకు వచ్చింది. తాజాగా గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ (Advent international) రాష్ట్రంలో రూ.16,650 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్దమైంది.

ఈ మేరకు కంపెనీ ఎండీ పంకజ్‌ పట్వారీ(Pankaj Patwari), సంస్థ ప్రతినిధులు హైదరాబాద్(Hyderabad)‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను కేటీఆర్‌కు వివరించారు.

Advent International to invest Rs.16,650 crore in Hyderabad, Telangana

ఈనేపథ్యంలో తెలంగాణలో ఈ సంస్థ భారీ పెట్టుబడి పెట్టడంపై మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఫార్మా, లైఫ్‌ సైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ వృద్ధికి సంకేమని చెప్పారు. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు.

కొత్తకోటలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్(KTR).ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంటకేశ్వర్‌ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ రాములు పాల్గొన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం బుగ్గపల్లితండా వద్ద రూ.425కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా వనపర్తి నియెజకవర్గం రాజాపేట వద్ద 96 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. సురవరం కళాభవన్‌ పేరుతో నిర్మించిన భవనాన్ని, సకల సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+