లుంబినీపార్క్, గోకుల్ చాట్ జంట పేలుళ్ల విచారణ పూర్తి: 27న తుది తీర్పు
హైదరాబాద్: నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసుల విచారణ మంగళవారం పూర్తి అయింది. విచారణ పూర్తి కావడంతో ఆగస్టు 27న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించనుంది.
2007, ఆగస్టు 25న సాయంత్రం సమయంలో గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వద్ద ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 42 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ పేలుళ్ల కేసులో నిందితులుగా అనిక్ షఫీక్ సయ్యద్(ఏ1), మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్(ఏ2), రియాజ్ భత్కల్(ఏ3), ఇక్బాల్ భక్తల్(ఏ4), ఫరూఖ్ షార్ఫూద్దిన్(ఏ5), మహ్మద్ సిద్ధి షేక్(ఏ6), అమీర్ రసూల్ ఖాన్(ఏ7) ఉన్నారు.
షఫీక్ సయ్యద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్, మహ్మద్ సిద్ధి షేక్ జైలులో ఉన్నారు. కాగా, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్ఫూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications