సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వింత అనుభవం ..సహజీవనం చేసిన తర్వాత వేశ్య అని తేలడంతో
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన విచిత్ర ఘటన ఇది. సహజీవనం పేరుతో ఓ మహిళ తనని మోసం చేసిందని.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ కుమార్ పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..కిరణ్ కుమార్ గత ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు.
అద్దె మిగులుతుందనే భావనతో..తనతో రూమ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సంప్రదించలంటూ OLXలో ఓ ప్రకటన ఇచ్చాడు. కిరణ్ కుమార్ ఇచ్చిన ప్రకటనకు ఓ మహిళ ఆసక్తి చూపించింది. ఇద్దరూ కొన్నాళ్లు అదే గదిలో ఉండగా...తరువాత కొంతకాలానికి కూకట్‌పల్లికి మకాం మార్చారు. అయితే కొద్ది రోజులకు ఆ మహిళ తాను ఒక వేశ్యనని చెప్పడంతో కిరణ్ కుమార్ కంగుతిన్నాడు.

దీంతో వెంటనే ఆ మహిళను గది ఖాళీ చేయాలని కోరాడు. దీనికి ఆ మహిళ నిరాకరించడంతో పాటు, గతంలో ఇద్దరు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. అక్కడితో ఆగకుండా కిరణ్ కుమార్ తనపై లైంగికంగా దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ..ఆ మహిళకు 4.7 లక్షల పరిహారం ఇప్పించారు.
పరిహారం తీసుకున్న తరువాత కూడా సదరు మహిళ కిరణ్ కుమార్‌తో దిగిన క్లోజ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో..బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఇద్దరి వ్యక్తులతో కిరణ్ కుమార్‌పై దాడి చేయించింది. దీంతో బాధితుడు కిరణ్ కుమార్ మరోసారి ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications