Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ కు అసలు పరీక్ష ఇప్పుడే - పొంచి ఉన్న ముప్పు, కేసీఆర్ వెయిటింగ్..!!

తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాదాపుగా రేవంత్ సీఎం అయ్యే అవకాశం ఉంది. రేవంత్ కు సీఎం పదవి ఇప్పటికిప్పుడు ఇవ్వకపోయినా..పీసీసీ చీఫ్ గా పార్టీలో..డిప్యూటీ సీఎంగా అటు ప్రభుత్వం లో కీలక బాధ్యతలు ఖాయం. అధికారంలోకి తేవటం ఒక లెక్కైతే రేవంత్ సమర్ధతకు అంతకు మించిన పరీక్ష ఎదురవుతోంది. అధికారం పూల బాట కాదు..ముళ్ల బాటగానే కనిపిస్తోంది. సమయం కోసం బీఆర్ఎస్, బీజేపీ వెయిట్ చేస్తాయి. అసలు పొంచి ఉన్న ముప్పేంటి.

నాలుగు సీట్లే అధికం:కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, 64 సీట్లు మాత్రమే సాధించింది. అంటే మేజిక్ ఫిగర్ కంటే కేవలం 4 స్థానాలు మాత్రమే ఎక్కువగా గెలిచింది. మిత్రపక్షం సీపీఐ ఒక స్థానంలో గెలుపొందింది. అయితే, మెజార్టీ స్వల్పంగానే కనిపిస్తున్నా..తక్షణం వచ్చే ముప్పు లేదు. కానీ, సీఎం పదవి ఎవరికి ఇచ్చినా...పార్టీలో సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్న ఇతర ముఖ్య నేతల నుంచి రానున్న రోజుల్లో ప్రత్యక్ష..పరోక్ష సమస్యలు తప్పవనేది వాస్తవం. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇస్తేనే అసమ్మతి గళం విప్పిన నేతలు ఇప్పుడు సీఎం పదవి ఇస్తే మౌనంగా ఉంటారా అనేది సందేహమే. అదే సమయంలో రేవంత్ సీఎంగా ఉంటే.. ఆయన కంటే సీనియర్లు అయిన ఈ నేతలు మంత్రులుగా ఉండేందుకు కాలం గడిచే కొద్దీ సమస్యగా మారే అవకాశం ఉంది.

After forming Govt in Telangana Congress to face many Challenges during Administration

హామీల అమలు కీలకం:ఇక..కాంగ్రెస్ ఇచ్చిన హామలు అమలు పార్లమెంట్ ఎన్నికలలోగా ప్రారంభించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నాయకత్వానికి లోక్ సభ ఎన్నికలు చాలా కీలకం. ఇదే టెంపో కొనసాగాలంటే హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలు అమలు చేయాలి. కానీ, రాష్ట్ర ఆర్దిక పరిస్థితి అందుకు సహకరించే స్థాయిలో లేదనేది అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అధికారంలోకి రాగానే ముందుగా రైతు బంధు 15 వేలు చొప్పున విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అదే విధంగా ఇతర గ్యారంటీ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలి. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి నిధుల సమీకరణ సమస్యగా మారనుంది. పథకాలు నిర్దేశిత సమయంలోగా ప్రారంభించక పోతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ తో ప్రతిపక్షాలు సిద్దంగా ఉంటాయి.

పొంచి ఉన్న ప్రతిపక్షం:ఇప్పుడు అసెంబ్లీలో ఓడిన బీఆర్ఎస్, బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పైన పై చేయి సాధించేందుకు ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వ తప్పులను ఉండగట్టే ప్రయత్నం చేయటం ఖాయం. అధికార బలం ఎంత ఉందో దాదాపుగా ప్రతిపక్ష పార్టీల బలం అంతే ఉంది. ఇక, మంత్రివర్గ కూర్పు సాహసంగా మారనుంది. ఎంతో మంది సీనియర్లు మంత్రి పదవులపైన ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేసారు. ఆ హామీ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో మద్దతు లభించలేదు. బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ పెంచిందనే అభిప్రాయమే ప్రధాన కారణం. హైదరాబాద్ లో తిరిగి పట్టు సాధించాలంటే పరిశ్రమలు..పెట్టుబడులు..ఉపాధి కల్పన కీలకం కానున్నాయి. దీంతో..ఈ అంశాలు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+