కెటిఆర్ ఎఫెక్ట్: లోకేష్‌ని కేంద్రమంత్రిని చేయాలని బాబుపై ఒత్తిడి! 'తెలంగాణ' కంట్రోల్‌పై డైలమా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి అద్భుత విజయం సాధించి పెట్టారు. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు తెలుగు తమ్ముళ్లలో చర్చకు వస్తోంది.
గెలుపోటముల విషయాన్ని పక్కన పెడితే... తెలంగాణ సీఎం కెసిఆర్ తనయుడు కెటిఆర్ తన సత్తా చూపించికున్నట్లుగా లోకేష్ కూడా రాజకీయంగా సత్తా చాటాలంటే ఆయనకు ఏదైనా పదవి ఇవ్వాలని టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి.
కొందరు టిడిపి నేతలు.. ముఖ్యంగా యువ నాయకులు లోకేష్‌ను రాజ్యసభకు పంపించాలని లేదా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట. లోకేష్‌కు ఏపీలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే, రాజ్యసభకు పంపిస్తే.. వచ్చే లాభ నష్టాల పైన బేరీజు కూడా వేస్తున్నారట.

లోకేష్‌కు ఏపీ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెడితే.. తెలంగాణలో తిరిగేందుకు ఆస్కారం పెద్దగా లభించదని, కాబట్టి రాజ్యసభకు పంపించడమే సముచితమని పలువురు నాయకులు సూచిస్తున్నారని తెలుస్తోంది.
రాజ్యసభకు.. ఆ తర్వాత కేంద్రమంత్రిగా అయితే తెలంగాణలోను పార్టీని కాపాడుకోవచ్చునని సూచిస్తున్నారంటున్నారు. లోకేష్‌ను ఏపీకి పరిమితం చేస్తే మాత్రం తెలంగాణలో పార్టీ తమ కంట్రోల్ నుంచి పోతుందని కొందరు చెబుతున్నారని తెలుస్తోంది.
అయితే, దీని పైన చంద్రబాబు స్పందించడం లేదని తెలుస్తోంది. నారా లోకేష్‌కు పదవి ఇస్తే అది తొందరపాటు అవుతుందని ఆయన భావిస్తున్నారా? లేక 2019 దాకా ఆగుదామనుకుంటున్నారా? తెలియాల్సి ఉంది. అయితే, ఆయనను రాజ్యసభకు పంపించడం సరైనదని కొందరు నేతలు గట్టిగా అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications