ఒక్కో ప్లాట్ ఫామ్ పై 2 రైళ్లు

దేశంలో ప్రధానమైన రైల్వేస్టేషన్‌ గా ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో అభివృద్ధి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆధునికీకరణ పనులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. మూడు సంవత్సరాల్లో ఈ పనులను పూర్తిచేయనున్నారు. టికెట్‌ బుకింగ్‌ కేంద్రాలు, రైల్వే రక్షణ దళం కార్యాలయాలను తరలించనున్నారు. అందుకు ప్రత్యామ్నాయ భవనాల నిర్మాణం చేపట్టారు.

అందుబాటులోకి రానున్న సౌకర్యాలు..

* సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఉత్తర, దక్షిణ వైపు జీ+ 3 అంతస్తులతో 37,308 చదరపు మీటర్ల భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
* ప్లాట్‌ఫామ్‌ల నిడివి కూడా పెరుగుతుంది. ఒక్కో ప్లాట్‌ఫామ్‌ మీద 2 రైళ్లు ఆగడమే కాక ఎక్కేవారు, దిగేవారు వేర్వేరు మార్గాల్లో వెళ్లడానికి వీలవుతుంది.

 trains

* రైల్వేస్టేషన్ లో ప్రస్తుతం ప్రయాణికులకు అందుతున్న సేవలు రెట్టింపవుతాయి.
* మొదటి అంతస్తులో 24,604 చదరపు మీటర్ల స్థలం అందుబాటులోకి రాబోతోంది.
* రెండో అంతస్తులో వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేస్తారు.
* 7.5 మీటర్ల వెడల్పుతో నడిచివెళ్లేవారి కోసం వంతెనలు, 26 లిఫ్టులు, 35 ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి.
* 1 నుంచి 10వ నెంబరు ప్లాట్ ఫామ్ ను కలుపుతూ పాదచారుల వంతెన అందుబాటులోకి వస్తోంది.
* విద్యుత్‌ కోసం 5,000 కేడబ్ల్యూపీ సోలార్‌ పవర్‌ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
* పచ్చదనం, పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారు.
* దివ్యాంగులు సులభంగా స్టేషన్‌లోకి చేరి రైళ్లు ఎక్కేలా ఏర్పాట్లు ఉండబోతున్నాయి. లోపలికి రావడం, బయటికి వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉండబోతున్నాయి.
* విశాలమైన రూఫ్‌ ప్లాజాతో పాటు రిటైల్‌ దుకాణాలు, రెస్టారెంట్లు, వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
* ఈస్ట్‌, వెస్ట్‌ మెట్రోస్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేయనున్నారు.
* ఉత్తరంవైపు అంతస్తులవారీగా, దక్షిణం వైపు అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ సదుపాయం.
* సికింద్రాబాద్‌ ఈస్ట్‌కు, పాత గాంధీ ఆసుపత్రి మెట్రోస్టేషన్‌కు నేరుగా వాక్‌వేలు
* రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకొనేలా వాక్‌వే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+