ప్రేమించి రహస్యంగా పెళ్ళిచేుసుకొన్నాక కులం తక్కువని వెళ్ళిపోయాడు

హైదరాబాద్ : కోచింగ్ సెంటర్ లో ప్రేమించుకొన్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్ళిచేసుకొన్నారు. కాని, ఇప్పడేమో తానేవరో తెలియదని తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిపై భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్కువ కులమని తనను వేదిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది.

వరంగల్ కు చెందిన ఓ యువతి నంద్యాలలోని కోచింగ్ సెంటర్ లో బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకొంటుంది. నంద్యాలకు చెందిన పి. అరవింద్ రెడ్డి ఆమెతో పరిచయం పెంచుకొన్నాడు. రహాస్యంగా ఆమెను వివాహాం చేసుకొన్నాడు.

పోటీ పరీక్షల శిక్షణ కోసం వచ్చి ప్రేమించుకొని రహాస్యంగా వివాహం చేసుకొన్నారు హైద్రాబాద్ లోని ఎల్ బి నగర్ లోని ఆర్ టి సి కాలనీలో గది అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు.ఆమెతో ఉన్న ఫోటోలను , వీడియోలను తీసుకొన్నాడు. కొంత కాలానికి ఆమెకు దూరంగా వెళ్ళిపోయారు.

after secretly married left her lower caste

అనుమానం వచ్చిన ఆ యువతి అరవింద్ రెడ్డి ఫోన్ చేసింది. ఆమె పోన్ చేస్తే ఆమెను దర్భాషలాడుతున్నాడని ఆమె ఆరోపిస్తోంది.తాను అగ్రకులానికి చెందిన వాడినని కులం పేరుతో తనను దూషిస్తున్నట్టు ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. తనకు దూరంగా ఉండాలని కోరుతన్నాడు. ఒకవేళ అలా చేస్తే తాను తన వద్ద ఉన్న వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాను మోసపోయాయని తెలుసుకొన్న భాదితురాలు చివరకు విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. సమాచారం తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆదివారం నాడు ఎల్ బి నగర్ కు చేరుకొన్నారు. ఆదివారం రాత్రి కుటుంసభ్యుల సహాకారంతో ఆమె ఎనల్ బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+