అంతర్జాతీయ మోసగాడి వలలో కోమటిరెడ్డి సోదరుడు: కోటిన్నర టోకరా
అంతర్జాతీయ మోసగాడు అగస్టన్ వలలో పడి రూ. కోటిన్నర మోసపోయారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి సోదరుడు నర్సిరెడ్డి.
హైదరాబాద్: అంతర్జాతీయ మోసగాడు అగస్టన్ వలలో పడి రూ. కోటిన్నర మోసపోయారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి సోదరుడు నర్సిరెడ్డి. సోలార్ పవర్ ప్రాజెక్ట్ పేరుతో నర్సిరెడ్డిని మోసం చేశాడు అగస్టన్.

దేశ వ్యాప్తంగా రూ. 150కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు అగస్టన్‌పై ఆరోపణలున్నాయి. ప్రముఖులే లక్ష్యంగా అతడు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
అంతేగాక, అమెరికాలో కంపెనీలు పెట్టినట్లు చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు అగస్టన్. కాగా, నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు.. నిందితుడు అగస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు చేసిన నేరాలపై విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications