సొంత నియోకవర్గంలో నటుడు, ఎమ్మెల్యే బాబు మోహన్‌కు షాక్, ఇదీ లిస్ట్!
ఆందోల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాబు మోహన్‌కు చేదు. సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేటలో ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తమ నగర పంచాయతీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఛైర్‌పర్సన్ కవిత సురేందర్ గౌడ్ ఆరోపించారు.
నగర పంచాయతీలో రూ.7 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన టెండర్లను ఇప్పటికే ఖరారయినప్పటికీ బాబు మోహన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయమై తాము ఇప్పటికే బాబు మోహన్‌ను కలిసి వివరించి చెప్పామని కవిత సురేందర్ అన్నారు. అయినా ఆయన తన తీరును మార్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పంచాయతీలో బాబు మోహన్ అడ్డుకున్న పనుల లిస్టుని తయారు చేసి, పాలకవర్గం సభ్యులు ప్రజలకు పంచారు.
అందోల్-జోగిపేట నగర పంచాయితీలో అయిదేళ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి లేదని ఆమె అన్నారు. అధికారులను బెదిరించి ఏ పనులు చేయకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనుల గురించి తమ పాలకవర్గం బాబు మోహన్‌ను కలిసి వివరించినా ఎలాంటి ఫలితం లేదన్నారు. దీంతో విసిగిపోయి ఆయన తీరును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగినట్టు తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications