Crop Loan Waiver: మిగిలిన వారికి రైతు రుణ మాఫీ రాదా..!

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు రుణ మాఫీ చేసినట్లు పేర్కొంది. అయితే చాలా మంది రైతులకు రుణాలు మాఫీ కాక ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రుణ మాఫీ పూర్తి చేసినట్లు చెబుతోంది. మొదటి విడతలో రూ.1 లక్షలోపు రుణాలు మాఫీ చేయగా.. రెండో దఫాలో రూ.1.50 వేల లోపు రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఇక మూడో దశలో రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినట్లు పేర్కొంది. అయితే దాదాపు సగం మందికి మాత్రమే రుణ మాఫీ అయినట్లు తెలుస్తోంది.

రైతు రుణ మాఫీకి రూ.31 వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి.. రూ.17 వేల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో చాలా మంది అన్నదాతలకు రుణ మాఫీ కాలేదు. చాలా మంది రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం టెక్నికల్ కారణాల వల్ల కొందరికి రుణ మాఫీ కాలేదని చెబుతున్నారు. బ్యాంకు లు సరైన వివరాలు ఇవ్వలేదని పలువురు బ్యాంకులను ప్రశ్నిస్తున్నారు.

Agriculture Minister Thummala responded when many farmers were worried that farmers loans had not been waived off

తమను వివరాలు అడలేదని బ్యాంకులు చెబుతున్నాయి. రుణ మాఫీ కాని వారి వివరాలు ఇవ్వమంటే ఇస్తామని.. కానీ ప్రభుత్వం వివరాలు అడగడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రైతులు ఏఈఓల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని.. బ్యాంకులను అడిగితే వాళ్లే లిస్ట్ పంపిస్తారుగా అంటు రైతులు నిలదీస్తున్నారు. గతంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కానీ రైతు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు.

ఈసారి కూడా రైతులను దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కాలయాపన చేస్తారని.. రైతులకు ఎగనామం పెడతారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతు రుణ మాఫీ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ వదిలే ప్రసక్తే లేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరో వైపు రుణ మాఫీ ఖాతాల్లో తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత బ్యాంకుల పైనే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి వక్రమార్గ అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు.

ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద రూ.18వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు. కొంత మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదన్నారు. అయితే రుణ మాఫీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా మంది తమకు రుణ మాఫీ కాలేదని కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్ లో రైతు రుణ మాఫీ గురించి వీడియో పెడితే తమకు రుణ మాఫీ కాలేదని చాలా మంది రైతులు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+