Tummala: తల తాకట్టు పెట్టి అయినా రైతు రుణ మాఫీ చేసి తీరుతాము..!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రైతు రుణ మాఫీ చేసింది. అయితే అందరికీ రైతు రుణ మాఫీ చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. తమకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వస్తున్నాయి. రైతు రుణ మాఫీ చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ చలో ప్రజా భవన్ కు పిలుపునిచ్చిన సంగతి తెసిలిందే. తాజాగా బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకోస్తోంది.
రైతు హామీల సాధన దీక్షను నిర్వహించింది. ఈ దీక్షకు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రైతు సంఘాలు కూడా దీక్షకు మద్దతు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి పెరిగింది. తాజాగా రైతు రుణ మాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాటారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మార్కెట్ కమిటీ కొత్త పాలక వర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన.. రుణ మాఫీ పూర్తి చేసి తీరుతామన్నారు. తల తాకట్టు పెట్టి అయనా అన్నదాతల రుణ తీర్చుకుంటామని తెలిపారు.

వీలైనంత త్వరగా అన్నదాతలకు రూ.2 లక్షల రుణ మాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతు రుణ మాఫీ ప్రక్రియ పూర్తి అయన తర్వాత రైతు భరోసా కూడా ఇస్తామని ప్రకటించారు. రైతులు పండించే ప్రతీ గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు ప్రతిపక్షాల కుట్రలో భాగం కావొద్దని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల్లో రైతులను మోసం చేసిన వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా సరిగా లేకున్నా రుణ మాఫీ చేశామన్నారు.
త్వరలోనే రాష్ట్రానికి పామాయిల్ పరిశ్రమ తీసుకొస్తామని వివరించారు. ఇండియా ప్రస్తుతం ఇతర దేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటోందని.. భవిష్యత్త్ లో ఇలాంటి పరిస్థితి రాకుండా పామాయిల్ సాగు పెంచుతామని పేర్కొన్నారు.
-
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications