కొండా పై హైకమాండ్ సీరియస్, కఠిన చర్యలు..!?
తెలంగాణ కాంగ్రెస్ లో కొండా వివాదం సంచలనంగా మారింది. గత కొంత కాలంగా కొండా వైఖరి పార్టీకి సమస్యగా మారుతోంది. జిల్లాలోని సొంత పార్టీ నేతలే కొండా పైన వరుస ఫిర్యాదులు చేస్తు న్నారు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ నుంచి ఇప్పుడు కుమార్తె సుస్మిత వరకు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి.. పార్టీకి సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. దీంతో. సీఎం రేవంత్ గుర్రుగా ఉన్నారు. చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. అటు ఏఐసీసీ సైతం వీరి పై చర్యలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొండా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో.. రేవంత్ ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ వ్యవహారం పైన సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణా రాహిత్యమని.. నోటీసులకే పరిమితం కాకూడదని డిసైడ్ అయ్యారు. నోటీసులకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు.

తన కుమార్తె వ్యాఖ్యలతో తాను ఏకీభవించటం లేదని.. తన కుమార్తె చేసిన వ్యక్తిగత ఆరోపణలకు తానెలా బాధ్యురాలినని గురువారం కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇచ్చారు. అదే విధంగా కొండా సురేఖ ఓఎస్డీ పైనా కేసు నమోదైంది. ఓ వ్యాపారిని బెదిరించి దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గతంలో ఓ వివాదంలో సుమంత్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినపుడు కూడా కొండా సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర స్థాయిలో అడ్డుకుని ఆరోపణలు చేశారు.
రేవంత్ సీరియస్.. కఠిన చర్యలు
కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడంతో పాటు ములుగు, పరకాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తోన్న కొండా సురేఖ మాత్రం పాల్గొనలేదు. సీఎం పర్యటనలో స్థానిక మంత్రి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఇలా, వరుస వివాదాలకు అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్న వీరి పైన చర్యలు తీసుకోవాల్సిందే అని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత హైకమాండ్ తో వీరి వ్యవహారం పైన చర్చించి.. కఠిన చర్యలు తీసుకుంటారని సమాచారం. ఇదే సమయంలో.. సురేఖ ఇచ్చిన వివరణ పైనా నాయకత్వం పరిశీలన చేస్తోంది. దీంతో.. ఇప్పుడు కొండా సురేఖ పైన తీసుకునే చర్యల పైనా పార్టీలో చర్చ సాగుతోంది.













Click it and Unblock the Notifications