దానంకు డిగ్గీ ఫోన్: పార్టీ మార్పుపై ఆరా, 'ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు'

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం ఫోన్ చేశారు. దానం నాగేందర్ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది.

AICC General secretary Digvijay Singh phone call to Danam Nagender

అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని, అంతా దుష్ప్రచారం జరుగుతోందని దిగ్విజయ్ సింగ్‌తో దానం నాగేందర్ చెప్పినట్టు సమాచారం. అలాగే పార్టీలో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని దిగ్విజయ్‌సింగ్‌ను దానం కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పరిధి తగ్గించాలన్న ప్రతిపాదనలపై దానం నాగేందర్ అసంతృప్తితో ఉన్నారని, దాంతో పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

బంగారు తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు: కె.లక్ష్మణ్‌

బంగారు తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట గురువారం టీడీపీ-బీజేపీ పార్టీలు కలిసి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ ధర్నాలోపాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా కేసీఆర్‌ విపక్షాల గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మారిందని ఆయన మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+