మోదీ ప్రభుత్వం పై ఎంఐఎం అధినేత అసద్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రధాని మోదీ పై ఎంఐఎం అధినేత అసద్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి..ఆయన కుటుంబ సభ్యులను వేధించటంలో బీజీగా ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నాయకత్వంలో తెలంగాణ సమ్మిళిత అభివృద్ధి సాధిస్తోందని అసద్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న వేళ అసద్ ఈ మేరకు ట్వీట్ చేసారు. బీజేపీ ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారని..ఇళ్లల్లో ఆయుధాలు ఉంచుకోవాలని సూచిస్తున్నారు..అంటూ అసద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అటు కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. కేంద్రం..బీజేపీ నేతల పైన మండిపడుతున్నారు. రాజకీయంగా వేధింపుల్లో భాగంగానే కవితకు నోటీసులు..విచారణ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు ఢిల్లీ..ఇటు హైదరాబాద్ లో నిరసనలు కొనసాగిస్తున్నారు. కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించగలరా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. అటు ఢిల్లీలో కవిత విచారణ కొనసాగుతోంది.

AIMIM Chief Asad Alleges Modi govt is busy targeting CM KCR Family Members Amid MLC KAvitha ED interrogation

ఇప్పటికే కవితకు నైతిక మద్దతు ఇచ్చేందుకు మంత్రులు కేటీఆర్, హరీష్ తో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేసారు. విచారణ సమయంలో ఈడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ స్పందించారు. బీజేపీ మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. అన్ని శక్తులను ఐక్యం చేసేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఉండకూడదని బీజేపీ భావిస్తోందన్నారు. దర్యాప్తు సంస్థల వేధింపులకు బీఆర్‌ఎస్ భయపడదని స్పష్టం చేశారు. కవిత పై ఈడీ కేసులు కక్ష పూరిత చర్యే అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+