కేసీఆరే సీఎం, ఏపీకి ఏం చేయని చంద్రబాబుకు హైదరాబాద్‌లో దమ్ముందా: అసదుద్దీన్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పూర్తి మెజార్టీతో మళ్లీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అవుతారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. అతని సోదరుడు, తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో అసదుద్దీన్ మాట్లాడారు. తమ పార్టీకి పదవుల పైన ఎలాంటి ఆశ లేదని చెప్పారు. మైనార్టీలు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే పాటు పడతామని చెప్పారు. తెలంగాణలో నాలుగేళ్లుగా ఒక్క మతఘర్షణా జరగలేదన్నారు. ప్రజలు అందరూ కలిసి ఉంటున్నారని వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ శనివారం ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు.

కేసీఆర్‌కు ప్రజాదరణ ఉంది
అనంతరం అసదుద్దీన్ మాట్లాడారు. ప్రజల విశ్వాసం ఉండడం వల్లే పదవీకాలం ఉన్నా టీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమైందన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఒక్క రోజు కూడా పదవిని వదులుకోవన్నారు. కేసీఆర్‌కు ప్రజాదరణ చాలా ఉందని అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్‌లను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేకే కాంగ్రెస్, టీడీపీలు ఇతర పార్టీలు పొత్తుల కోసం పాకులాడుతున్నాయన్నారు.

ఏపీకి ఏం చేయని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు?
నాలుగున్నరేళ్లుగా ఏపీకి ఏం చేయని నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పొత్తుతో కాంగ్రెస్, టీడీపీలు నిండా మునుగుతాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అని, అదే పార్టీతో మళ్లీ పొత్తు ఎలా పెట్టుకుంటుందన్నారు.

చంద్రబాబుకు దమ్ముంటే ఇక్కడ పోటీ చేయ్
తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల పొత్తులు, ఎత్తులను ప్రజలు తిప్పికొడతారని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే హైదరాబాద్‌లో ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు పోటీ చేయకపోయినా ఆయన కొడుకు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను అయినా పోటీ చేయించాలన్నారు.

ఓ విజన్ లేదు
కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడాన్ని అసదుద్దీన్ స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. వారికి ఓ అజెండా లేదన్నారు. కానీ తెలంగాణపై కేసీఆర్, తెరాసకు విజన్ ఉందని చెప్పారు. కేసీఆర్ తప్పు చేస్తే తప్పకుండా విమర్శిస్తామని, కానీ ఆయన ఇప్పటి వరకు చేసిన పనికి ప్రశంసించాల్సిందే అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications