హైదరాబాద్ - ఢిల్లీ విమాన టికెట్ రూ 89 వేలు: భారీగా పెంపు, ఎక్కడకు ఎంత..!!

విమానాల టికెట్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విమానాల టికెట్ ధరలకు డిమాండ్ వచ్చింది. ఇదే అవకాశంగా విమానయాన సంస్థలు ధరలను పెంచాయి. విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో కొన్నిరోజులుగా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. కాగా , వందలాది విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్తున్న విమానాల టికెట్ ధరలతో ప్రయాణీకులు బెంబేలెత్తుతున్నారు.

ఒక్క సారిగా విమాన టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇండిగో సేవలు వందల సంఖ్యల నిలిచి పోవటంతో.. ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, చెన్నై, గోవా విమానా శ్రయాల్లో కూడా పరిస్థితి భిన్నంగా ఏం లేదు. అక్కడ కూడా కొందరు ప్రయాణికులు ఆగ్రహంతో అరుస్తూ, నినాదాలు చేస్తూ సిబ్బందిని ప్రశ్నిస్తూ కనిపించారు. కొంతమంది ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లను చుట్టుముట్టి వివరాలు అడిగారు. హైదరాబాద్​లో 75, కోల్‌కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 ఇండిగో విమానాలను రద్దు చేసింది. విశాఖపట్నం విమానాశ్రయంలో 49 డిపార్చర్లు, 43 అరైవల్స్‌ రద్దు అయ్యాయి. దీంతో, ఇతర విమాన సంస్థలు టికెట్ ధరలు భారీగా పెంచాయి. డిమాండ్ పెరగటంతో హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే టికెట్ ధరలను పెంచటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.

air-ticket-charges-increased-by-multi-fold-after-cancellation-of-multiple-indigo-flights

హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 84 ఇండిగో విమానాలు రద్దు కాగా, పలు ప్రాంతాల నుంచి రావాల్సిన 74 విమానాలను రద్దు చేసారు. ఇక.. తాజా డిమాండ్ తో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమాన టికెట్ రూ 89 వేలుగా ఉంది. ముంబాయికి 40 వేలు, విజయవాడకు రూ 18 వేలు వసూలు చేస్తున్నాయి. ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ ధర వరుసగా రెండో రోజు భారీగా పతనమైంది. విమానాల రద్దు వివాదం నేపథ్యంలో నేడు ఎన్‌ఎస్‌ఈ లో ఇండిగో షేర్లు దాదాపు 3 శాతానికి పైగా పడిపోయాయి. విమానాల ఆలస్యం, రద్దుపై ఇప్పటికే ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి 10 నాటికి ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఈనెల 8 నుంచి విమానాలను తగ్గించను న్నట్లు వెల్లడించారు. ఈ అసౌకర్యానికి గానూ ప్రయాణికులకు ఎయిర్‌లైన్‌ క్షమాపణలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+