Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏకే 47 మిస్‌ఫైర్: తల భాగం నుంచి దూసుకెళ్లిన తూటా, ఆక్టోపస్ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ సమీపంలో బేగంపేటలోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక కమాండో విభాగం (ఆక్టోపస్) కార్యాలయంలో ఆదివారం ఏకే 47 మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో సెంట్రీలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న శివకుమార్‌ను తోటి సిబ్బంది సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన శివకుమార్ (24) 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్. ప్రస్తుతం టీఎస్‌ఎస్‌పీ 13వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

AK-47 fires accidentally, kills constable on duty in Hyderabad

ఇటీవలే డిప్యుటేషన్‌పై గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విధులు ముగించుకున్న శివకుమార్ తన వద్దనున్న ఏకే 47 పిస్టల్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పిస్టల్ పేలి గడ్డం కింది నుంచి తూటా దూసుకుపోయి, తల భాగం నుంచి బయటకు వచ్చింది.

మృతదేహాన్ని నిమ్స్ మార్చురీలో ఉంచారు. ఆక్టోపస్ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆక్టోపస్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక తుపాకీ ప్రమాదవశాత్తూ పేలిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శివకుమార్‌ స్వస్థలం అదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల పట్టణం. తండ్రి ఆంజనేయులు, తల్లి విజయలక్ష్మి. తండ్రి ఏనాడో కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి మరణించిది. ఒక తమ్ముడు చిన్నప్పుడే చనిపోయాడు. ప్రస్తుతం అక్క, చెల్లి ఉన్నారు. తాత అనంతులస్వామి సింగరేణి కార్మికుడిగా పదవీవిరమణ చేశారు.

తాత పెంపకంలో డిగ్రీ పూర్తిచేసిన శివకుమార్‌ 2011లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం మంచిర్యాల సమీపంలోని గుడిపేట 13వ పోలీస్‌ బెటాలియన్‌ (టీఎస్‌పీసీ)లో విధులు నిర్వర్తించాడు. ఆరు నెలల క్రితమే ఆక్టోప్‌సలో చేరాడు. హైదరాబాద్‌ రహ్మతనగర్‌లో నివాసం ఉంటున్నాడు.

కాగా శివకుమార్‌ అవివాహితుడు. కొద్దికాలంగా మంచిర్యాలకు చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విధి నిర్వహణలో ఎంతో ధైర్యంగా ఉండే అతడు.. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని సహచరులు చెబుతున్నారు. తానే స్వయంగా కాల్చుకుని ఉంటే.. తూటా తల భాగంలో దిగేదని.. కానీ.. గొంతు కింద దవడ భాగంలో బుల్లెట్‌ వెళ్లటంతో.. ఇది ప్రమాదవశాత్తూ జరిగినట్లుగా భావిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+