వాహనదారులకు అలర్ట్.. ఈ నెల 28వరకు నగరంలోని ఆ ఫ్లైఓవర్ మూసివేత..
హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ పనులలో భాగంగా శిల్పా లే అవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉంది. ఇందులో భాగంగానే ఈ నెల 22వ తేదినుంచి 28వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ వివరించారు.
ఈ క్రమంలో నిర్ణీత సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను మూసి వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కావున, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు. ఎస్ఆర్డీపీ పనులలో భాగంగా శిల్పా లే అవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగా అక్టోబర్ 28వ తేదీ వరకు రాత్రి 11గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ తెలిపారు. ఈ క్రమంలో నిర్ణీత సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Traffic Advisory
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) October 22, 2024
Due to Construction of the SRDP Shilpa Layout Phase II at Gachibowli Junction from 22-10-2024 to 28-10-2024 during night hours from 11:00 PM to 6:00 AM. Gachibowli flyover will be closed.#cybtraffic#Gachibowli#Cyberabad pic.twitter.com/7JlOWHvsME
ట్రాఫిక్ మళ్లింపులు..
బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్ బైపాస్ చేస్తూ బిచ్చారెడ్డి స్వీట్స్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకోగలరు. అలాగే, ఐఐఐటీ జంక్షన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ పక్క నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకోవచ్చు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications