తెలంగాణలో మరో మూడ్రోజులపాటు ఎడతెరిపిలేని వానలు, పలుచోట్ల భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా చిరు జల్లులు పడుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న మూడు రోజులపాటు ఎడతెరిపి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం 8.30 గంటలకు వాయుగుండంగా బలపడిందని పేర్కొన్నారు. ఇది వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైందని తెలిపింది.

alert: next three days normal to heavy rains in telangana districts

Recommended Video

    వద్దంటే వాన, 14వ తేదీ వరకు జోరుగా జనం ఇబ్బందులు * Telangana | Telugu OneIndia

    ఈ వాయుగుండం రానున్న 6గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు పేర్కొన్నారు.

    తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. మంగళవారం కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+