తెలంగాణ ఎన్నికల బరిలో అభ్యర్థులు ఎంతమంది అంటే?: ఓటర్లకు కీలక సమాచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతోంది. రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, బంగారు ఆభరణాలు, ఇతర సామాగ్రిని సీజ్ చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ. 700 కోట్లకుపైగా సొత్తు స్వాధీనం చేసుకుంది.

ఇక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో మహిళా అభ్యర్థులు 221 మంది ఉన్నారు. పురుషులు 2068 మంది, ఒక ట్రాన్స్‌జెండర్ పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,58,71,493 మంది, మహిళా ఓటర్లు 1,58,43,339, ప్రవాస ఓటర్లు 2944 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు సంఖ్య 2,557, రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2944 మంది ఓటర్లున్నారు. ఇక, 9,99,667 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయస్సువారున్నారు.

 all arrangements set for telangana assembly elections: key highlights

కాగా, నవంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఓట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21,686 వీల్ చైర్లు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ఏర్పాటు చేశారు.

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 120 పోలింగ్ కేంద్రాలను నిర్వహించనున్నారు దివ్యాంగులు. 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. పోలింగ్ ప్రక్రియలో 1,85,000 మంది సిబ్బంది, 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తున్నారు.

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగితా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50 వేల మంది పోలీసులను కేటాయించింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3 ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+